News October 12, 2025
APPLY NOW: CBSLలో ఉద్యోగాలు

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్(CBSL)ముంబై కార్పొరేట్ ఆఫీస్‌లో ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్/ఆఫీస్ వర్క్) కోసం దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా ఈ నెల 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. పని అనుభవంగల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. వెబ్‌సైట్: https://www.canmoney.in/
Similar News
News October 12, 2025
తెలంగాణ అప్డేట్స్

* కొండా దంపతులు, పొంగులేటి శ్రీనివాస్ వివాదంపై CM రేవంత్ సీరియస్.. మేడారం పనులు పూర్తి చేయాలని ఆదేశం
* జూబ్లీహిల్స్ BJP అభ్యర్థిగా దీపక్ రెడ్డి ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం
* యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం
* గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ భరత్‌పై చర్యలు తీసుకోవాలని ‘మా’ అధ్యక్షుడు విష్ణుకు MLC బల్మూరి వెంకట్ విజ్ఞప్తి
News October 12, 2025
‘స్థానిక’ ఎన్నికలు: రేపు సుప్రీంకోర్టుకు సర్కార్

TG: ‘స్థానిక’ ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని తెచ్చిన జీవో నం.9పై హైకోర్టు <<17958620>>స్టే<<>> విధించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫున ఢిల్లీకి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిని పంపే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం. అటు PCC చీఫ్ మహేశ్ ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
News October 12, 2025
మా బౌలర్లను అంతలా బాదకు జైస్వాల్.. లారా రిక్వెస్ట్

భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ రెండో టెస్టులో 175 పరుగులతో వెస్టిండీస్ బౌలర్లను వణికించిన సంగతి తెలిసిందే. నిన్న ఆట ముగిసిన తర్వాత విండీస్ దిగ్గజ బ్యాటర్ లారా మైదానంలో యశస్వీని కలిసి కంగ్రాట్స్ చెప్పారు. ‘మా బౌలర్లను అంతలా బాదకు’ అని లారా వ్యాఖ్యానించగా.. ‘లేదు సర్. ట్రై చేస్తున్నా’ అని జైస్వాల్ అన్నారని BCCI <