News October 6, 2025

APPLY NOW: IUCTEలో ఉద్యోగాలు

image

ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (IUCTE) 10 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: www.iucte.ac.in

Similar News

News October 6, 2025

CJIపై దాడికి యత్నించిన లాయర్‌ సస్పెన్షన్

image

CJI BR గవాయ్‌పై షూ విసిరేందుకు యత్నించిన లాయర్ రాకేశ్ కిశోర్‌ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది. దేశవ్యాప్తంగా ఏ కోర్టు, ట్రిబ్యునల్, లేదా లీగల్ అథారిటీలో ప్రాక్టీస్ చేయకుండా వేటు వేసింది. తదుపరి చర్యల కోసం షోకాజ్ నోటీస్ జారీ చేయనుంది. ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత 15రోజుల్లోగా తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో లాయర్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కాగా CJIపై దాడికి యత్నించడాన్ని CPI ఖండించింది.

News October 6, 2025

దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే

image

ఎ లేడీ ఆఫ్ మెనీ ఫస్ట్స్..దీనికి నిర్వచనం ముత్తులక్ష్మిరెడ్డి. బ్రిటిష్ ఇండియాలోని తొలి మహిళా ఎమ్మెల్యే. దేశంలోనే తొలి హౌస్‌సర్జన్. స్టేట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డ్ తొలి ఛైర్‌పర్సన్. లెజిస్లేటివ్ కౌన్సిల్ తొలి డిప్యూటీ ప్రెసిడెంట్. 1886 జులై 30న ముత్తులక్ష్మి మద్రాసులోని పుదుక్కోటైలో జన్మించారు. 13 ఏళ్ల వయసులో 10th, 1912లో వైద్యవిద్యను పూర్తి చేశారు. తర్వాత ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు.

News October 6, 2025

ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెడతారా: జగన్

image

AP: ఉద్యోగులకిచ్చిన హామీల అమలుపై YCP చీఫ్ జగన్ CM చంద్రబాబును ప్రశ్నించారు. ‘ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపి నడిరోడ్డుపై నిలబెడతారా? IR, PRC, OPS ఏమయ్యాయి? న్యాయంగా పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారు. 4 డీఏలు పెండింగ్‌‌లో పెట్టారు. EHS డబ్బులు ఇవ్వకపోవడంతో ఉద్యోగులకు ఆస్పత్రులు వైద్యం నిరాకరిస్తున్నాయి. రెండేళ్ల కాలంలో ఉద్యోగులకైనా, ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు’ అని ట్వీట్ చేశారు.