News October 4, 2025
APPLY NOW: NITCలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్ 12 ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఆయా విభాగాల్లో పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.2500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500. వెబ్‌సైట్: https://nitc.ac.in/
Similar News
News October 4, 2025
వెస్టిండీస్.. ఇదేం ఆట!

ఒకప్పుడు వెస్టిండీస్ జట్టంటే విధ్వంసకర బ్యాటర్లు, నిప్పులు చెరిగే బౌలర్లతో నిండి ఉండేది. ఇప్పుడు కనీసం పోటీ ఇవ్వలేని దీనస్థితికి దిగజారింది. భారత్‌తో తొలి టెస్టులో కనీసం 2 రోజులు కూడా నిలబడలేకపోయింది. నిలకడ లేని ఆటగాళ్లున్న WIకు టెస్టులు సెట్ కావడం లేదు. ఒకవేళ ఆడించినా IND, AUS, ENG, NZ, SAతో కాకుండా చిన్న దేశాలతోనే సిరీస్‌లు నిర్వహించాలని క్రికెట్ అభిమానులు సూచిస్తున్నారు. మీ కామెంట్?
News October 4, 2025
BREAKING: ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు

TG: హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో బస్సు ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు ఈనెల 6నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. మొదటి 3 స్టేజీల వరకు రూ.5 చొప్పున, 4వ స్టేజీ నుంచి రూ.10 చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేయనుంది. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఇ-ఆర్డినరీ, ఇ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పెంచిన ఛార్జీలు అమలుకానున్నాయి.
News October 4, 2025
కూటమి నేతలతో కలిసే వెళ్లాలి: పవన్ కళ్యాణ్

AP: క్షేత్రస్థాయిలో పరిస్థితులను సరిదిద్దుకొంటూ ముందుకెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలను ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్న ఆయన క్షేత్ర స్థాయిలో కూటమి నేతలతో కలిసే పనిచేయాలని స్పష్టం చేశారు. అభిప్రాయ భేదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు.