News December 27, 2024
APPLY NOW.. భారీ జీతంతో ఉద్యోగాలు

ESIC 608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. MBBS అర్హత ఉన్న 35 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన వారికి రూ.56,100-రూ.1,77,500 జీతం చెల్లిస్తారు. జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ <
Similar News
News November 15, 2025
అల్పపీడనం.. ఈ నెల 24 నుంచి భారీ వర్షాలు

ఈ నెల 19 నాటికి అండమాన్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ఈ నెల 24-27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News November 15, 2025
శ్రీవారి గర్భగుడిలో ఏయే విగ్రహాలుంటాయంటే..?

తిరుమల ఆనంద నిలయంలో మూలవిరాట్ ప్రధానం కాగా అందుకు ప్రతిరూపమైన భోగ శ్రీనివాసమూర్తికి నిత్యాభిషేకాలు, రోజువారీ సేవలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, ఊరేగింపులలో పాల్గొనే శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు ఇతర సమయాల్లో గర్భాలయంలో కొలువై ఉంటారు. అలాగే కొలువు, ఉగ్ర శ్రీనివాసమూర్తులను కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ 5 విగ్రహాలను కలిపి ‘పంచబేరాలు’ అంటారు.
☞ మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News November 15, 2025
నేడు ఎంత పవిత్ర దినమో తెలుసా?

కార్తీకం అంటేనే పరమ పవిత్రం. ఈ మాసంలో వచ్చే ఏకాదశి అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అందులోనూ ఈ ఏకాదశి శనివారం రోజున రావడం మహా యోగమని పండితులు చెబుతున్నారు. ఇన్ని శుభాలు ఒకే రోజు రావడం శ్రీహరిని కొలిచే భక్తులకు అపారమైన అనుగ్రహాన్నిస్తుంది. నేడు నారాయణుడిని పూజించి ‘దామోదర ఆవాహయామి’ అంటూ దీపాలు వెలిగిస్తే.. శని ప్రభావం తగ్గి, హరి అనుగ్రహంతో సుఖశాంతులు, సర్వశుభాలు కలుగుతాయని నమ్మకం.


