News February 2, 2025
APPLY NOW.. భారీ జీతంతో ఉద్యోగాలు
BHEL 400 ఇంజినీర్ ట్రైనీ, సూపర్‌వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో ఇంజినీర్ పోస్టులు 150 కాగా, మిగతావి సూపర్‌వైజర్ ఉద్యోగాలు. బీటెక్, బీఈ పూర్తైన 27 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన వారికి ట్రైనింగ్‌లో రూ.32,000-రూ.50,000 మధ్య, ఆ తర్వాత రూ.33,500-రూ.1,80,000 పేస్కేలుతో జీతం అందిస్తారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం ఇక్కడ <
Similar News
News February 2, 2025
రికార్డులతో ‘అభి’షేకం
భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టీ20ల్లో ఒక ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచారు. 54 బంతుల్లోనే 13 సిక్సర్లు, 7 ఫోర్లతో 135 పరుగులు చేశారు. మరోవైపు ఒకే ఇన్నింగ్సులో అత్యధిక సిక్సర్లు బాదిన ఇండియన్ ప్లేయర్‌గానూ నిలిచారు.
News February 2, 2025
వారిద్దరు రాజీనామా చేయాలి: టీపీసీసీ చీఫ్
TG: బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినందుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాజీనామా చేయాలని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు ఈ విషయంలో తమతో కలిసి కేంద్రంపై పోరాటం చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా మోదీపై యుద్ధం ప్రకటించాలన్నారు.
News February 2, 2025
టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు వీరి ఖాతాలో
* డేవిడ్ మిల్లర్(2017-SA)- 35 బంతులు
* రోహిత్ శర్మ(2017-INDIA)- 35 బంతులు
* అభిషేక్ శర్మ(2025-INDIA)- 37 బంతులు
* జాన్సన్ చార్లెస్(2023-WEST INDIES)- 39 బంతులు
* సంజూ శాంసన్(2024-INDIA)- 40 బంతులు
* టాప్-5లో ముగ్గురు భారత ప్లేయర్లే కావడం విశేషం.