News February 25, 2025

APPLY NOW.. టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

image

215 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాల భర్తీకి అస్సాం రైఫిల్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. MAR 22 వరకు అప్లై చేసుకోవచ్చు. APR 4వ వారంలో ర్యాలీ ఉంటుంది. టెన్త్ నుంచి డిగ్రీ వరకు పోస్టులను బట్టి వేర్వేరు అర్హతలుండగా, పోస్టుల వారీగా 18-30 ఏళ్లలోపు వారు అర్హులు. PST, PET, రాత పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ టెస్టుల తర్వాత ఎంపిక ఉంటుంది. ఫీజు OC, OBC, EWSలకు ₹100. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News November 21, 2025

రైతుల ఆత్మహత్యాయత్నం.. మీ హామీ ఏమైంది రేవంత్: హరీశ్ రావు

image

TG: భూములు రిజిస్ట్రేషన్ కావడం లేదని MLA క్యాంపు/తహసీల్దార్ ఆఫీసుల వద్ద రైతులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని హరీశ్ రావు ట్వీట్ చేశారు. ‘అధికారంలోకి వస్తే 3 నెలల్లో భూ సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ ఏమైంది రేవంత్? మీ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. భూములపై రైతులకు హక్కు లేకుండా చేస్తోంది. 70వేల పెండింగ్‌ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు.

News November 21, 2025

తీవ్ర కాలుష్యం.. ఢిల్లీలో స్కూల్ గేమ్స్ బ్యాన్!

image

ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో స్కూళ్లలో ఓపెన్ గ్రౌండ్ క్రీడలను నిషేధించే దిశగా అక్కడి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాధారణంగా వింటర్ సీజన్‌లో ఢిల్లీలోని స్కూల్స్ స్పోర్ట్స్ మీట్స్ నిర్వహిస్తుంటాయి. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గేమ్స్ రద్దు అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. కాగా ఇండోర్ గేమ్స్ నిర్వహణకూ సౌకర్యాలు కల్పించాలని పేరెంట్స్ కోరుతున్నారు.

News November 21, 2025

ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి అప్డేట్

image

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌పై అప్డేట్ వచ్చింది. ‘రెబల్ సాబ్’ అనే సాంగ్‌ను ఈనెల 23న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా అదిరిపోయే పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే.