News October 20, 2024
APPLY NOW: 732 ఉద్యోగాలకు రేపే లాస్ట్

తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించిన 732 ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఫార్మసీ పూర్తిచేయడంతో పాటు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నవారు అప్లికేషన్‌కు అర్హులు. వయసు ఈ ఏడాది జులై నాటికి 46 ఏళ్లకు మించరాదు. అభ్యర్థులు <
Similar News
News March 15, 2025
గ్రీన్‌కార్డు హోల్డర్స్ శాశ్వత పౌరులేమీ కాదు: జేడీ వాన్స్

గ్రీన్ కార్డు సిటిజన్స్ అమెరికా శాశ్వత పౌరులేమీ కాదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. USAకు వారివల్ల ప్రమాదం ఉందని తెలిస్తే వారినీ దేశం నుంచి బహిష్కరిస్తామన్నారు. గ్రీన్‌కార్డు హోల్డర్స్ ఇమిగ్రేషన్ పాలసీకి భంగం కలిగించనంత వరకే వారు దేశంలో ఉండేలా హక్కు ఉందని దానిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపారు. అధ్యక్షుడు ఎవరినైనా USAనుంచి పంపించాలనుకుంటే వెళ్లాల్సిందేనని చెప్పారు.
News March 15, 2025
ఇవాళ అసెంబ్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తీర్మానంపై సమాధానం ఇవ్వనున్నారు. ఉ.10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్‌పై విపక్షాల విమర్శల నడుమ ఆయన ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇవాళ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుపై సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మార్చనున్నట్లు సమాచారం.
News March 15, 2025
కొత్త కెప్టెన్లు.. ఏం చేస్తారో?

ఐపీఎల్ 2025లో అన్ని జట్లకు కెప్టెన్లు ఖరారయ్యారు. కొత్తగా పంజాబ్‌కు శ్రేయస్, KKRకు రహానే, లక్నోకు పంత్, ఢిల్లీకి అక్షర్, ఆర్సీబీకి రజత్ పాటీదార్‌ను సారథులుగా నియమించారు. ఇందులో KKR మినహా మిగతా జట్లకు ఇప్పటివరకు ఒక్క కప్పు రాలేదు. గత సీజన్లో కోల్‌కతాను విన్నర్‌గా నిలిపిన అయ్యర్ ఈ సారి పంజాబ్‌తో చేరడం ఆసక్తికరంగా మారింది. మరి కొత్త కెప్టెన్ల రాకతోనైనా ఆయా జట్ల దశ మారుతుందో చూడాలి. మీ కామెంట్?