News December 12, 2025
APPLY NOW: NAARMలో ఉద్యోగాలు..

HYDలోని ICAR-నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్(<
Similar News
News December 12, 2025
తండ్రయిన టాలీవుడ్ యంగ్ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తండ్రయ్యారు. ఆయన భార్య కల్పనారావు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తిరువీర్ తన ఆనందాన్ని X వేదికగా పంచుకున్నారు. ‘నాయినొచ్చిండు ❤️’ అంటూ బిడ్డ చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేయగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘మసూద’, ‘పలాస 1978’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన తిరువీర్.. కల్పనారావును 2024లో వివాహం చేసుకున్నారు.
News December 12, 2025
‘అల్లూరి’ ప్రమాదంలో చనిపోయింది వీరే

AP: అల్లూరి జిల్లాలో జరిగిన <<18540010>>ప్రమాదంలో<<>> 9 మంది చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వారి వివరాలు.. శైలా రాణి(తెనాలి), శ్యామల(తిరుపతి), పి.సునంద(పలమనేరు), శివశంకర్ రెడ్డి(పలమనేరు), నాగేశ్వరరావు(చిత్తూరు), కావేరి కృష్ణ(బెంగళూరు), శ్రీకళ(చిత్తూరు), దొరబాబు(చిత్తూరు), కృష్ణకుమారి(బెంగళూరు). కాగా గాయపడిన 25 మందికి చింతూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.
News December 12, 2025
రాజీనామా చేయాలనుకుంటున్నా.. బంగ్లా ప్రెసిడెంట్ సంచలన కామెంట్స్

బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ సంచలన కామెంట్స్ చేశారు. ఆ దేశ అధ్యక్షుడిగా తనకున్న అధికారాలను తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపిస్తున్న యూనస్ తొలగించారని షాబుద్దీన్ అన్నారు. సుమారు 7 నెలలుగా తనతో ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదని చెప్పారు. అన్ని దేశాలలోని బంగ్లా రాయబార కార్యాలయాల్లో తన ఫొటోను తొలగించారన్నారు. అవమానంగా ఉందని, ఎన్నికల తర్వాత తన పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.


