News January 22, 2026
APPLY NOW: NCPORలో ఉద్యోగాలు..

గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్(NCPOR) 6 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 2న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి PG( ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, ఎర్త్ సైన్స్, జియోలజీ, CS, CS &Engg.), BE, BTech, ME, MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు రూ.56వేలు+HRA చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.ncpor.res.in
Similar News
News April 4, 2026
డెంగ్యూ లక్షణాలపై తప్పనిసరి పరీక్షలు

డెంగ్యూ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డా. కామేశ్వర ప్రసాద్ సూచించారు. ఓల్డ్ లెక్చరర్ గ్యాలరీలో జరిగిన మలేరియా ల్యాబ్ టెక్నీషియన్స్ సమావేశంలో మాట్లాడారు. రోజుకు 65 పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ టైమ్ ప్రకారం విధులు నిర్వహించాలని తెలిపారు. హెచ్ఐవి, టీబీ కేసుల రికార్డులను సక్రమంగా నిర్వహించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
News April 4, 2026
కల్తీ పండ్లను ఇలా గుర్తించండి

మామిడి, అరటి, బొప్పాయి, సపోటా పండ్లను కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలు ఉపయోగించి కృత్రిమంగా మగ్గిస్తుంటారు. అవి ఆరోగ్యానికి చాలా హానికరం. వాటిని గుర్తించేందుకు కొన్ని టిప్స్..
*ఒకే రంగులో చాలా ప్రకాశవంతంగా కనిపించడం (ముఖ్యంగా మామిడి, అరటిపండు)
*బయట మెత్తగా, లోపల గట్టిగా ఉండటం
*పండినట్లు కనిపించినా వాసన లేకపోవడం
*పండ్లపై కార్బైడ్ పొడిలాంటి అవశేషాలు కనిపించడం
*ఆకుపచ్చ మచ్చలు, పసుపు రంగు చర్మం
News April 4, 2026
PHOTO OF THE DAY

బ్యాంకాక్ వేదికగా జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో వరల్డ్ నంబర్-1 <<18221945>>శీతల్ దేవిని<<>> మన దేశానికే చెందిన 18 ఏళ్ల <<19294633>>పాయల్ నాగ్<<>> ఓడించారు. మహిళల వ్యక్తిగత కాంపౌడ్ విభాగంలో 139-136 పాయింట్ల తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ సాధించారు. పతకం ఒకరే గెలిచినా తమ ఆటతీరుతో వీరిద్దరూ ప్రజల మనసులను గెలిచారు. వీరు కలిసి దిగిన ఫొటో SMలో వైరలవుతోంది. జీవితంలో మోటివేషన్, ఇన్‌స్పిరేషన్‌కు ఈ ఆర్చరీ మహారాణులే నిదర్శనం.


