News March 5, 2025
APPLY NOW.. నెలకు రూ.5000

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ కోసం దరఖాస్తు గడువు MAR 12తో ముగియనుంది. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ITI, డిగ్రీ చదివిన 21-24 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగులు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8లక్షలలోపు ఉండాలి. దీని ద్వారా దేశంలోని టాప్-500 కంపెనీల్లో ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు. నెలకు రూ.5000 స్టైఫండ్, వన్‌టైం గ్రాంట్ కింద రూ.6000 ఇస్తారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <
Similar News
News November 14, 2025
MGB సీఎం అభ్యర్థి తేజస్వీ వెనుకంజ

ఆర్జేడీ కీలక నేత, MGB సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. రాఘోపూర్ నుంచి పోటీ చేసిన ఆయన 3,000 ఓట్లతో వెనుకపడ్డారు. 4వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్‌కు 17,599 ఓట్లు రాగా, తేజస్వీకి 14,583 ఓట్లు వచ్చాయి. ఇంకా 26 రౌండ్లు ఉన్నాయి.
News November 14, 2025
15వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వరుసగా 6 రౌండ్లలో నవీన్ యాదవ్ ఆధిక్యం సాధించారు. ప్రస్తుతం ఆయన 15,589 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. రౌండ్ రౌండ్‌కు ఆయన ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్‌లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: TPCC చీఫ్

జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడుతున్నారని TPCC చీఫ్ మహేశ్ అన్నారు. మెజారిటీ ఇంకా ఎక్కువ రావాల్సి ఉన్నప్పటికీ ఓటింగ్ శాతం ప్రభావం చూపుతోందన్నారు. BRS డైవర్షన్ పాలిటిక్స్ చేసిందని, మహిళల సెంటిమెంట్‌ను వాడుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అయినా ప్రజలు అభివృద్ధి కోసం ఆలోచించారని, ఈ ఫలితం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.


