News May 8, 2024

APPLY NOW: రైల్వేలో SI, కానిస్టేబుల్ ఉద్యోగాలు

image

RPFలో 4,660 పోలీస్ ఉద్యోగాల(SI-452, కానిస్టేబుల్-4,208)కు దరఖాస్తు గడువు సమీపిస్తోంది. అర్హులైన అభ్యర్థులు మే 14 వరకు అప్లై చేసుకోవచ్చు. SI అభ్యర్థులకు డిగ్రీ, 20-28 ఏళ్ల వయసు, కానిస్టేబుల్ అభ్యర్థులు 18-28 ఏళ్ల వయసు, టెన్త్ పాసై ఉండాలి. ఆన్‌లైన్‌ టెస్టు, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. SIలకు ₹35,400, కానిస్టేబుళ్లకు ₹21,700 ప్రారంభ వేతనం ఉంటుంది. వెబ్‌సైట్: <>rrbapply.gov.in<<>>

Similar News

News February 5, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలుకు సిట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని కోణాల్లో విచారణ జరిపిన సిట్, నిబంధనల ఉల్లంఘనను శాస్త్రీయంగా నిరూపించాల్సి ఉంది. అటు సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో KCR పేరును నిందితుడిగా చేరుస్తారా లేదా సాక్షిగా ఉంచుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన ప్రమేయం ఉందని ఆధారాలు దొరికితే అరెస్టుల పర్వం మళ్లీ మొదలయ్యే అవకాశముంది.

News February 5, 2026

రాజ్యసభలో ఖర్గేvsనడ్డా

image

రాజ్యసభలో LoP ఖర్గే, కేంద్ర మంత్రి నడ్డా మధ్య వాగ్వాదం జరిగింది. ‘దేశానికి ముఖ్యమైన అంశాల గురించి రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడాలనుకుంటున్నారు. కానీ అనుమతించడం లేదు’ అని ఖర్గే ఆరోపించారు. దీనికి నడ్డా స్పందిస్తూ ‘లోక్‌సభ వ్యవహారాలపై రాజ్యసభలో చర్చ వద్దు. LoP తొలుత లోక్‌సభ ప్రొసీడింగ్స్ గురించి తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు. కాగా ఇవాళ ప్రధాని మోదీ ప్రసంగించాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దయ్యింది.

News February 5, 2026

T20WC: టీమ్ ఇండియాకు గాయాల భయం!

image

రెండ్రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం అవుతుండటంతో ఇద్దరు టీమ్ ఇండియా ప్లేయర్ల ఫిట్‌నెస్ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. నిన్న SAతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా ఒకే ఓవర్ వేసి కాసేపటికే మైదానాన్ని వీడారు. ఏదో నొప్పితో బాధపడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. న్యూజిలాండ్ సిరీస్‌లో గాయపడిన సుందర్ ఇంకా కోలుకోలేదు. ఎప్పుడు జట్టుకు అందుబాటులోకి వస్తారన్న దానిపై స్పష్టత లేదు.