News March 3, 2026
APPLY NOW: SPMCILలో ఉద్యోగాలు

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) 3 సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు మార్చి 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35 ఏళ్లు. నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.spmcil.com
Similar News
News March 3, 2026
గ్రహణం ఎఫెక్ట్.. టీమ్‌ఇండియా ప్రాక్టీస్ ఆలస్యం!

ENGతో జరగనున్న T20 WC సెమీస్ కోసం టీమ్‌ఇండియా ముంబై వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు 6PM నుంచి 9PM వరకు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అయితే గ్రహణం కారణంగా షెడ్యూల్ టైమింగ్స్ మార్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. 6.47PMకి గ్రహణం ముగియడంతో 7PM నుంచి ప్రాక్టీస్ మొదలెట్టినట్లు తెలిపింది. గ్రహణం టైంలో ప్రాక్టీస్ చేయడం మంచిది కాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
News March 3, 2026
స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ దొరికితే..: CM

TG: మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులు చెల్లించాలని సీఎం రేవంత్ కలెక్టర్లను ఆదేశించారు. పిల్లలకు పోషకాహారం అందాలని, అందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఇక స్కూళ్లు, కాలేజీల్లో గంజాయి, డ్రగ్స్, ఈ-సిగరెట్ల వినియోగం జరిగితే అందుకు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. సైకాలజిస్టులను నియమించుకోవాలని సూచించారు.
News March 3, 2026
ఇండియాను విడిచి వెళ్తా: ఇరానియన్ నటి

భద్రతా కారణాల వల్ల తాను ఇండియాను విడిచి వెళ్లాలనుకుంటున్నట్లు ఇరానియన్ మోడల్, హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ మందన కరిమి వెల్లడించారు. దేశం విడిచి వెళ్లిన తర్వాతే పూర్తి వివరాలు బయటపెడతానన్నారు. ‘ఇరాన్‌లో నియంతృత్వంపై మాట్లాడటం. వాస్తవాలు చెప్పడం వల్ల చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. నాకు ప్రభుత్వం/మీడియా నుంచి సపోర్ట్ లేదు. ఇక్కడ ఇంట్లో ఉన్నట్లు అనిపించడం లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.


