News February 21, 2025
APPLY.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టులు

బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ విభాగాల్లో 518 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ మేనేజర్ మొదలు క్లౌడ్, ఏఐ ఇంజినీర్ పోస్టుల వరకూ పలు కొలువులు వీటిలో ఉన్నాయి. 22-43 మధ్య వయసుండి డిగ్రీ, బీఈ, సీఏ, బీటెక్, ఎంబీయే విద్యార్హతలున్న వారు సంబంధిత విభాగాల్లో అప్లై చేసుకోవచ్చు. మార్చి 11 తుది గడువు.
Similar News
News February 22, 2025
భర్త కట్నం అడగనప్పటికీ 498ఏ కేసు పెట్టొచ్చు: సుప్రీం కోర్టు

భర్తపై 498A చట్టం ప్రకారం కేసు పెట్టడానికి అతడు కట్నం అడిగి ఉండాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ‘భర్త కట్నం అడిగితేనే ఆ కేసు పెట్టాలన్న రూలేం లేదు. క్రూరత్వం ఏ రూపంలో ఉన్నా అది వర్తిస్తుంది’ అని పేర్కొంది. ఓ భర్త కట్నం అడగకపోయినా భార్య 498ఏ కేసు పెట్టగా అది చెల్లదని AP హైకోర్టు తీర్పు చెప్పింది. దాన్ని సవాలు చేస్తూ బాధితురాలు సుప్రీంకు వెళ్లగా ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది.
News February 22, 2025
ఇంకా ప్రమాదంలోనే పోప్ ఆరోగ్యం

పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని ఆయనకు చికిత్స అందిస్తున్న జెమెల్లీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ‘పోప్ న్యుమోనియాతో బాధపడుతున్నారు. బ్రాంకైటిస్గా మొదలైన సమస్య డబుల్ న్యుమోనియాగా మారింది. ఆయనకు విశ్రాంతి అవసరం. కనీసం వారం రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు.
News February 22, 2025
నేడు మిర్చి యార్డ్, ట్రేడర్లతో సీఎం భేటీ

AP: మిర్చి ధరల అంశంపై సీఎం చంద్రబాబు నేడు మిర్చి యార్డ్ అధికారులు, ట్రేడర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ధరల పతనంపై వారితో చర్చించే అవకాశం ఉంది. ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తైంది. అందులో 4లక్షల మెట్రిక్ టన్నుల్ని వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి. ఇక మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.