News July 19, 2024
APPLY: బీడీ కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్స్

AP, TGలోని బీడీ కార్మికులు, మైనింగ్ వర్కర్ల పిల్లలు కేంద్ర కార్మిక శాఖ నేషనల్ స్కాలర్‌షిప్స్ కోసం scholarships.gov.in/లో అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న 1-10 విద్యార్థులకు ప్రీ-మెట్రిక్, 11వ తరగతి నుంచి డిగ్రీ వరకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్స్ వస్తాయి. ప్రీమెట్రిక్ కోసం AUG 31, పోస్ట్ మెట్రిక్ కోసం OCT 31లోపు అప్లై చేసుకోవాలి. హెల్ప్ లైన్ నం. 0120-6619540, 040-29561297.
Similar News
News February 12, 2026
సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్.. తేడాలేంటో తెలుసా?

సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ ఇద్దరూ మానసిక ఆరోగ్యనిపుణులే అయినప్పటికీ చదువు, చికిత్స పద్ధతుల్లో తేడాలు ఉంటాయి. సైకియాట్రిస్టులు డాక్టర్లు (MBBS/MD). వీరు మందుల ద్వారా చికిత్స చేస్తారు. మరోవైపు సైకాలజిస్టులు ప్రొఫెషనల్ వైద్యులు కాదు. డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి సమస్యలను టాక్ థెరపీ/కౌన్సెలింగ్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు. వీరికి మందులు రాసే అధికారం ఉండదు.
News February 12, 2026
ఫలితాలకు ముందే క్యాంపు రాజకీయాలు!

TG: మున్సిపల్ ఫలితాలు వెల్లడికాక ముందే పార్టీలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాయి. తమకు మెజార్టీ వచ్చే స్థానాల్లోని అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాయి. BRS MLA జగదీశ్ రెడ్డి సూర్యాపేట నుంచి అభ్యర్థులను HYD శివార్లలోని రహస్య ప్రాంతానికి తరలించారు. మంచిర్యాల నుంచి తడోబాకు, ఆదిలాబాద్ నుంచి అయోధ్యకు బీజేపీ అభ్యర్థులను తీసుకెళ్లారు. అటు కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది.
News February 12, 2026
కిసాన్ రైల్ ద్వారా 34 వేల టన్నుల పంట ఉత్పత్తుల రవాణా

ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కిసాన్ రైల్ ద్వారా 116 సర్వీసులతో 34వేల టన్నుల పంట ఉత్పత్తులను వివిధ రాష్ట్రాలకు రవాణా చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2020 AUG 7న కిసాన్ రైళ్లను కేంద్రం ప్రారంభించింది. AP నుంచి మామిడి, అరటి, ఉల్లి ఇతర ఉద్యాన ఉత్పత్తులను బిహార్, అస్సాం, ప.బెంగాల్, ఢిల్లీ, త్రిపురలకు రవాణా చేశామని.. లోక్‌సభలో TDP MP ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


