News March 21, 2025
మాకూ ఆ పథకాన్ని వర్తింపజేయండి: ఈబీసీలు

TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని తమకూ వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఈబీసీ సంక్షేమ సంఘం లేఖ రాసింది. అగ్రవర్ణ పేద యువతను సీఎం విస్మరించడం బాధకరమని లేఖలో పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరింది. కాగా ఈ పథకంతో రాష్ట్రంలో 5 లక్షల మందికి గరిష్ఠంగా రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది.
Similar News
News March 28, 2025
బాలికల గురుకులాల్లో పురుష సిబ్బంది ఉండొద్దు: ఎస్సీ సొసైటీ

TG: SC బాలికల గురుకులాలు, కాలేజీల్లోని అన్ని పోస్టుల్లో మహిళా సిబ్బందే ఉండాలని SC గురుకుల సొసైటీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీవో 1274 ఉత్తర్వులను యథావిధిగా అమలు చేయాలని తెలిపింది. బాలికల విద్యాలయాల్లో ఎవరైనా పురుష సిబ్బంది కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బాలుర స్కూళ్లు, కాలేజీలను జనరల్గా పరిగణించి వాటిలోని పోస్టులను మహిళలు, పురుషులతో భర్తీ చేస్తామని పేర్కొంది.
News March 28, 2025
ఈ 3 రంగాలకు AIతో ముప్పు లేదు: బిల్ గేట్స్

AI వల్ల పలు రంగాల్లో ఉద్యోగాలు పోతాయన్న అంచనాల నేపథ్యంలో బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కోడింగ్, బయాలజీ, ఎనర్జీ రంగాల ఉద్యోగాలను AI రీప్లేస్ చేయలేదు. AI కోడింగ్ చేసినా ప్రోగ్రామర్ల అవసరం ఉంటుంది. బయాలజిస్ట్లను కూడా అది భర్తీ చేయలేదు. కానీ వ్యాధి నిర్ధారణ, DNA విశ్లేషణ వంటి వాటిలో ఉపయోగపడుతుంది’ అని అన్నారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని AI ఇంకా సొంతం చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
News March 28, 2025
ఈ సీజన్లో ఆడతానని అనుకోలేదు: శార్దూల్

IPL వేలంలో ఎంపిక కాకపోవడంతో ఈ సీజన్లో ఆడతానని అనుకోలేదని LSG బౌలర్ శార్దూల్ ఠాకూర్ తెలిపారు. ‘నేను కౌంటీ క్రికెట్ ఆడాలని ప్లాన్ చేసుకున్నా. రంజీలో ఆడుతున్నప్పుడు జహీర్ ఖాన్ ఫోన్ చేసి నన్ను రీప్లేస్మెంట్గా తీసుకుంటామని చెప్పారు. జీవితంలో ఎత్తుపల్లాలు ఒక భాగం. నేను ఎప్పుడూ నా స్కిల్స్నే నమ్ముకుంటా’ అని పేర్కొన్నారు. గాయం కారణంగా టోర్నీకి దూరమైన మోహ్సిన్ ఖాన్ స్థానంలో శార్దూల్ జట్టులోకి వచ్చారు.