News January 5, 2025

వారంలో జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలు

image

TG: రాష్ట్రంలో త్వరలో జూనియర్ లెక్చరర్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెండేళ్ల కిందటే 1392 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. సెలక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను ఇంటర్ కమిషనరేట్‌కు అప్పగించింది. మల్టీజోన్‌-1లో 581 మంది, జోన్-2లో 558 మంది ఉన్నారు. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తికాగా వీరికి వారంలోగా నియామక పత్రాలు ఇచ్చి కాలేజీల్లో భర్తీ చేయనున్నారు.

Similar News

News January 4, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన నవీన్ రావు విచారణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు సిట్ విచారణ ముగిసింది. సుమారు 7 గంటలకు పైగా అధికారులు ఆయనను ప్రశ్నించారు. SIB మాజీ అధికారులతో సంబంధాలపై ఆరా తీశారు. అయితే రాజకీయ కుట్రలో భాగంగానే వేధిస్తున్నారని విచారణ అనంతరం నవీన్ రావు ఆరోపించారు. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని, ఇది బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న దాడి అని అభివర్ణించారు.

News January 4, 2026

BCB రిక్వెస్ట్.. శ్రీలంకలో బంగ్లా మ్యాచులు!

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు ఇరు దేశాల మధ్య <<18748860>>క్రికెట్‌పై<<>> ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో T20WCలో తమ మ్యాచులు భారత్‌ నుంచి మార్చాలని BCB రిక్వెస్ట్ చేసింది. దీనిపై ICC సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ స్టేజ్‌లో భారత్‌లో జరగాల్సిన బంగ్లా మ్యాచులను శ్రీలంకకు మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే 48గంటల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని క్రిక్ బజ్ పేర్కొంది.

News January 4, 2026

రాత్రిపూట ఇవి తినకపోవడం మంచిది

image

మంచిగా నిద్ర పట్టాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా రాత్రి భోజనంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. నూనెలో వేయించిన పదార్థాలు, అధిక మసాలా ఆహారం గుండెల్లో మంట, ఎసిడిటీకి కారణమవుతాయి. తీపి పదార్థాలు, చాక్లెట్లు బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని పెంచుతాయి. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. రాత్రి భోజనాన్ని పడుకోవడానికి 2Hr ముందే తీసుకుంటే మంచిది.