News March 12, 2025
నేడు వారికి నియామక పత్రాలు

TG: జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లుగా ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రవీంద్రభారతిలో నియామక పత్రాలు అందజేయనున్నారు. జేఎల్ పోస్టుల భర్తీకి 2023లో పరీక్షలు నిర్వహించగా గత ఏడాది ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు 2023లోనే పరీక్షలు నిర్వహించారు. JLగా 1,290, పాలిటెక్నిక్ లెక్చరర్లుగా 240 మంది ఎంపికైనట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 11, 2025
మల్లోజుల, తక్కళ్లపల్లి రాజకీయ ద్రోహులు: అభయ్

TG: ఇటీవల లొంగిపోయిన సీనియర్ మావోలు మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావును ‘రాజకీయ ద్రోహులు’గా పేర్కొంటూ మావోయిస్టు కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ లేఖ విడుదల చేశారు. వీరిద్దరూ MH, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలతో ముందస్తు ఒప్పందం చేసుకున్నారని, వారికి మావోయిస్టు పంథాను తప్పుబట్టే హక్కులేదని మండిపడ్డారు. దివంగత మావోయిస్టు నేత నంబాల కేశవరావు ఆయుధాలు విడిచిపెట్టాలని ఎప్పుడూ చెప్పలేదని గుర్తు చేశారు.
News November 11, 2025
కొవిడ్ లాక్డౌన్.. వారికి కొత్త ద్వారాలు తెరిచింది

కరోనా లాక్డౌన్ వీరి జీవితాన్ని మార్చేసింది. లండన్లో BBA చదువుతున్న ఆయుష్, దుబాయ్లో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రిషబ్ ఇండియాకు తిరిగివచ్చారు. స్వదేశంలోనే ఉండాలని, వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ప్రోత్సాహంతో కూరగాయల సాగును ప్రారంభించి.. పుట్టగొడుగులకు ఉన్న డిమాండ్ చూసి వాటిని కూడా ఉత్పత్తి చేస్తూ ఆగ్రా సహా ఇతర రాష్ట్రాల మార్కెట్లు, హోటల్స్కు అందిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.
News November 11, 2025
ఇతిహాసాలు క్విజ్ – 63

ఈరోజు ప్రశ్న: సూర్యపుత్రుడు అయిన కర్ణుడిని గురువైన పరశురాముడు ఎందుకు శపించాడు? ఏమని శపించాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


