News November 13, 2024

మరో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం

image

APలో మరో నాలుగు కార్పొరేషన్ల డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రజక, కొప్పుల వెలమ, గవర, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్లలో 15 మంది చొప్పున మొత్తం 60 మంది డైరెక్టర్లను నియమించారు. ప్రతి కార్పొరేషన్‌లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ సభ్యుడికి అవకాశం ఇవ్వగా, మిగతా 12 మంది టీడీపీ వాళ్లే. జాబితా కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News November 26, 2025

తాజా సినిమా కబుర్లు

image

✦ ‘వారణాసి’ మూవీలో మహేశ్ బాబు చిన్ననాటి పాత్రలో సుధీర్ బాబు కొడుకు ‘దర్శన్’?: సినీ వర్గాలు
✦ ‘రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్‌పై విమర్శలు.. కథ, సందర్భం, డైరెక్టర్ విజన్‌కు తగినట్లు పాట ఉంటుంది. ప్రతీ పాట ఎలివేషన్‌లా ఉంటే బోర్ కొడుతుందన్న లిరిసిస్ట్ రామజోగయ్య
✦ రవితేజ, శివ నిర్వాణ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌గా ప్రియ భవాని శంకర్?
✦ ‘MAD’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంతో కార్తీ హీరోగా సినిమా?

News November 26, 2025

పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా HYD నిలవాలి: CM

image

అంత‌ర్జాతీయ సంస్థ‌ల పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా HYD నిలిచేలా TG రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ‘ఫ్యూచ‌ర్ సిటీలో చేపట్టే ప్ర‌తి అంశాన్ని హైలైట్ చేయాలి. పెట్టుబ‌డిదారుల‌కు సిటీలోని అనుకూలాంశాలు, రాష్ట్ర క‌ళా, సాంస్కృతిక, భాష, వాతావ‌ర‌ణ అనుకూల‌త‌ను వివ‌రించాలి. ప్రముఖులకు బ్రాండింగ్‌లో చోటు క‌ల్పించాలి’ అని సమ్మిట్ బ్రాండింగ్‌పై జరిగిన సమీక్షలో సూచించారు.

News November 26, 2025

పీస్ ప్లాన్ ఫైనల్ అయ్యాకే పుతిన్, జెలెన్‌స్కీతో భేటీ: ట్రంప్

image

రష్యా, ఉక్రెయిన్ మధ్య వీలైనంత త్వరగా శాంతి నెలకొంటుందని భావిస్తున్నట్లు US ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు వారం రోజులుగా పీస్ ప్లాన్‌పై వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. US ప్రతిపాదించిన 28 పాయింట్ల ప్లాన్‌కు ఇరు దేశాలు కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చాయని, కొన్నింటికి అంగీకారం రావాల్సి ఉందన్నారు. ఈ డీల్ ఫైనల్ అయ్యాకే పుతిన్, జెలెన్‌స్కీతో సమావేశం అవుతానని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.