News September 22, 2024
ఆరు మార్కెట్ యార్డులకు పాలకవర్గాల నియామకం

TG: రాష్ట్రంలో మరో ఆరు మార్కెట్ యార్డులకు పాలకవర్గాలను ప్రభుత్వం నియమించింది. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్, కమ్మర్‌పల్లి, వేల్పూరు, కరీంనగర్ జిల్లాలో గోపాల్‌రావు పేట, రాజన్నసిరిసిల్ల జిల్లాలో బోయిన్‌పల్లి, కామారెడ్డి జిల్లాలో బిక్కనూరు మార్కెట్ యార్డులకు పాలకవర్గాలను నియమించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వీటితో కలిపి ఇప్పటివరకు 70 మార్కెట్లకు పాలకవర్గాల నియామకం జరిగిందన్నారు.
Similar News
News February 10, 2026
ఫిబ్రవరి 10: చరిత్రలో ఈరోజు

☛ 1921: ఇండియా గేట్‌కు శంకుస్థాపన
☛ 1923: X-కిరణాల సృష్టికర్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ మరణం
☛ 1985: సినీ గాయని ప్రియా హిమేశ్ జననం
☛ 1990: సింగర్ రేవంత్ జననం
☛ 1993: స్వాతంత్ర్య సమరయోధుడు గయా ప్రసాద్ కటియార్ మరణం (ఫొటోలో)
☛ 2010: భారత ఆర్థికవేత్త, తొలి ప్రణాళికా సంఘం సభ్యుడు KN.రాజ్ మరణం
☛ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం
News February 10, 2026
హైదరాబాద్‌లో విజయ్-రష్మిక రిసెప్షన్?

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ఈ నెల 26న పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి మరింత బలం చేకూరుస్తూ మార్చి 4న వీరి రిసెప్షన్ HYDలోనే జరగనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరవుతారని పేర్కొన్నాయి. పెళ్లి రాజస్థాన్‌లో జరగనుందని సమాచారం. అయితే పెళ్లిపై రష్మిక-విజయ్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Photo: AI
News February 10, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


