News October 15, 2024

జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం

image

AP: జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
*విజయనగరం- వంగలపూడి అనిత
*విశాఖ- డోలా బాల వీరాంజనేయస్వామి
*శ్రీకాకుళం- కొండపల్లి శ్రీనివాస్
*పార్వతీపురం మన్యం, కోనసీమ- అచ్చెన్నాయుడు
*అనకాపల్లి- కొల్లు రవీంద్ర
*కాకినాడ- పొంగూరు నారాయణ
*ఏలూరు- నాదెండ్ల మనోహర్
*ఎన్టీఆర్- సత్యకుమార్

Similar News

News January 1, 2026

అసభ్యంగా తాకేందుకు ప్రయత్నిస్తే బూటుతో కొట్టా: బ్రిటన్ రాణి

image

టీనేజీలో తనకు ఎదురైన అనుభవాన్ని బ్రిటన్ రాణి కెమిల్లా తాజాగా పంచుకున్నారు. ‘16-17 ఏళ్ల వయసులో నేను లండన్‌లో రైలులో వెళ్తుండగా ఓ వ్యక్తి అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. అతడిని అడ్డుకోవడంతో నాపై దాడి చేశాడు. నేను బూటు తీసి కొట్టాను. మహిళలపై జరుగుతున్న హింస ఎంత పెద్ద సమస్యో తెలియజేసేందుకే ఇప్పుడు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా’ అని ఓ రేడియో ఇంటర్వ్యూలో కెమిల్లా తెలిపారు.

News January 1, 2026

సింగర్ మంగ్లీ ఈవెంట్‌లో విషాదం?

image

AP: సింగర్ మంగ్లీ ఈవెంట్‌లో విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురంలో శుభారంభ్ పేరుతో నిర్వహిస్తున్న న్యూఇయర్ వేడుకల్లో ఓ యువకుడు చనిపోయాడని సమాచారం. వేణుగోపాల్ నగర్‌కు చెందిన షౌకత్ కరెంట్ షాక్‌తో మృతి చెందాడని తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేడుకల సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

News January 1, 2026

జనవరి 1: చరిత్రలో ఈరోజు

image

1892: స్వాతంత్ర్య సమరయోధుడు మహదేవ్ దేశాయ్ జననం
1894: గణిత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ జననం
1911: స్వాతంత్ర్య యోధురాలు ఎల్లాప్రగడ సీతాకుమారి జననం
1975: నటి సోనాలి బింద్రే జననం
1979: నటి విద్యాబాలన్ జననం
1955: శాస్త్రవేత్త శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ మరణం (ఫొటోలో)
1994: తెలుగు రచయిత చాగంటి సోమయాజులు మరణం (ఫొటోలో)
2007: తెలుగు సినీ నిర్మాత డూండీ మరణం