News October 18, 2024

9 యూనివర్సిటీలకు వీసీల నియామకం

image

TG: * కాకతీయ వర్సిటీ – ప్రతాప్ రెడ్డి
* ఉస్మానియా – ఎం.కుమార్
* పాలమూరు – శ్రీనివాస్
* శాతవాహన – ఉమేశ్ కుమార్
* తెలుగు వర్సిటీ – నిత్యానంద రావు
* మహాత్మాగాంధీ వర్సిటీ – అల్తాఫ్ హుస్సేన్
* తెలంగాణ వర్సిటీ – యాదగిరి రావు
* వ్యవసాయ వర్సిటీ – అల్దాస్ జానయ్య
* ఉద్యానవన వర్సిటీ – రాజిరెడ్డి

Similar News

News October 18, 2024

లోన్లపై RBI నిషేధం: ఫిన్‌టెక్ ఇండస్ట్రీలో ప్రకంపనలు

image

నావి ఫిన్‌సర్వ్‌తో పాటు 3 NBFCs లోన్లు ఇవ్వకుండా RBI నిషేధం విధించడం ఫిన్‌టెక్ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపింది. గ్రోత్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడాలన్న మైండ్‌సెట్టే వేటుకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. రూల్స్ పాటించకపోవడం, ఇష్టారీతిన ఎక్కువ వడ్డీకి రుణాలివ్వడం, ఫెయిర్ ప్రాక్టీస్ కోడ్, రుణ గ్రహీతల ఆర్థిక స్తోమత పట్టించుకోకపోవడం, ప్రాపర్‌గా లేని ఇన్‌కం అసెస్‌మెంట్లను RBI సీరియస్‌గా తీసుకుంది.

News October 18, 2024

ఆ రికార్డులో రెండో స్థానానికి కోహ్లీ

image

టెస్టుల్లో విరాట్ కోహ్లీ 9వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నారు. బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన హాఫ్ సెంచరీ దాటారు. ఈక్రమంలో ఈ ఘనత అందుకున్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన క్రికెటర్లలో రెండో స్థానంలో ఆయన కొనసాగుతున్నారు. 596 ఇన్నింగ్స్‌లలో ఆయన 221 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేశారు. ఈ జాబితాలో సచిన్(264) అగ్రస్థానంలో ఉన్నారు.

News October 18, 2024

ఎంతవరకైనా పోరాడతా: బండి సంజయ్

image

TG: గ్రూప్-1 అభ్యర్థుల కోసం ఎంతవరకైనా పోరాడతానని కేంద్రమంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. జీవో 29 ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గొడ్డలిపెట్టని ఆయన అభివర్ణించారు. మెయిన్స్‌ను రీషెడ్యూల్ చేసేవరకు ఉద్యమిస్తానని బండి వెల్లడించారు. మరోవైపు పరీక్ష వాయిదా వేయాలంటూ HYD అశోక్‌నగర్‌లో రోడ్లపైకి వచ్చిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మరెవరూ నిరసనకు దిగకుండా అక్కడ భారీగా మోహరించారు.