News August 11, 2025
HCAలో రూల్స్‌కు విరుద్ధంగా నియామకాలు: ఫహీమ్

TG: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)లో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని కాంగ్రెస్ నేత MA ఫహీమ్ ఆరోపించారు. ఈ విషయంపై CID, విజిలెన్స్&ఎన్‌పోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ‘అర్హత లేకపోయినా కొందరిని సీనియర్, జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. ఎన్పీ సింగ్, ఆకాశ్ బండారికి తప్ప ఛైర్‌పర్సన్‌తో సహా మరెవరికీ సరైన అర్హతలు లేవు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన కోరారు.
Similar News
News August 11, 2025
APలో మైండ్‌ట్రీ పెట్టుబడులు

AP:అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రముఖ టెక్ సంస్థ LTIMindtree పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ‘దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌ను రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నందుకు గర్వంగా ఉంది. L&T, IBM, AP GOVTతో కలిసి ప్రపంచస్థాయి క్వాంటమ్ ఎకో సిస్టమ్‌ను ఆవిష్కరిస్తాం. మా క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డీప్ టెక్ రీసెర్చ్, ఇంక్యుబేషన్, ఆవిష్కరణలకు నాయకత్వం వహిస్తుంది’ అని Xలో వెల్లడించింది.
News August 11, 2025
ఆక్వా రంగం నష్టపోకుండా చర్యలు: అచ్చెన్నాయుడు

AP: ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం భారత్‌తో పాటు అన్ని దేశాలపై పడిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ రంగానికి <<17357620>>నష్టం <<>>లేకుండా అన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు. ఎల్లుండి ఆక్వా రంగంపై సమావేశం నిర్వహిస్తామని, అభివృద్ధికి నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. సమస్యను అధిగమించేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.
News August 11, 2025
క్రైం న్యూస్ రౌండప్

* హైదరాబాద్ ORRపై వాహనం ఢీకొని ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు మృతి. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు
* విశాఖ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం. బ్రేకులు ఫెయిలై ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లడంతో మహిళ దుర్మరణం, మరొకరికి తీవ్రగాయాలు
* వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం. కార్మికుడి మృతి