News January 19, 2025
వైసీపీలో నియామకాలు.. చోడవరానికి అమర్నాథ్, భీమిలికి శ్రీను

AP: పలు నియోజకవర్గాలకు వైసీపీ నూతన సమన్వయకర్తలను నియమించింది. చోడవరానికి గుడివాడ అమర్నాథ్, మాడుగులకు బూడి ముత్యాలనాయుడు, భీమిలికి మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను), గాజువాకకు తిప్పల దేవన్ రెడ్డి, పి.గన్నవరానికి గన్నవరపు శ్రీనివాసరావును నియమించింది. అలాగే అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీని, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్‌బాబుకు బాధ్యతలు అప్పగించింది.
Similar News
News December 5, 2025
నల్గొండ: ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం అందాలి: కలెక్టర్

నల్గొండ జిల్లాలోని ప్రతి పేద విద్యార్థి ఉపకార వేతనం (స్కాలర్షిప్) పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంఈఓలు, సంక్షేమ శాఖల అధికారులతో ఆమె పాఠశాల విద్యార్థుల స్కాలర్షిప్ మంజూరుపై సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, ఏ ఒక్క పేద విద్యార్థి కూడా స్కాలర్షిప్ కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
News December 5, 2025
TG న్యూస్ రౌండప్

* కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్‌పై అభిప్రాయాలు సేకరించేందుకు రేపు తెలంగాణ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. దీనికి KTR హాజరవుతారు: బోయినపల్లి వినోద్
* కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇన్ఛార్జ్ VCగా డా.రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
* HYD శామీర్‌పేటలో ఓ కారు టైర్లు, సీట్ల కింద ₹4Cr నగదును పోలీసులు గుర్తించారు. హవాలా ముఠాను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
News December 5, 2025
గాంధీ చూపిన మార్గమే స్ఫూర్తి: పుతిన్

భారత్-రష్యా బలమైన బంధానికి గాంధీ చూపిన అహింసా మార్గమే స్ఫూర్తి అని రాజ్‌ఘాట్ సందర్శకుల పుస్తకంలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాసుకొచ్చారు. శాంతి, అభివృద్ధికి ఆయన చూపిన మార్గం భవిష్యత్తు తరాలను ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుందన్నారు. జీవితాన్ని భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి అంకితం చేశారని, అహింసకు చిహ్నంగా మారారని రాశారు. ద్వైపాక్షిక వాణిజ్యం, దౌత్య సంబంధాలపై చర్చించడానికి పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.


