News June 28, 2024
నెలకు ₹10 వేలతో యువతకు అప్రెంటిస్‌షిప్: MH సర్కార్
మహారాష్ట్ర సర్కార్ వార్షిక బడ్జెట్‌లో యువతకు నెలకు ₹10,000 అందించే అప్రెంటిస్‌షిప్ పథకాన్ని ప్రకటించింది. అలాగే అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు, 21-60 ఏళ్ల మహిళలకు నెలకు ₹1500, మహిళలకు ఇ-రిక్షాలు కొనేందుకు ఆర్థికసాయం, రైతులకు విద్యుత్ బిల్లుల మాఫీ, ముంబైలో పెట్రోల్(65p), డీజిల్(₹2) ధరలు తగ్గించనున్నట్లు తెలిపింది. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Similar News
News October 8, 2024
వారికి నేరుగా ఇంటర్‌లో ప్రవేశాలు: మంత్రి పొన్నం
TG: గురుకులాల్లో పదో తరగతి పాసైన విద్యార్థులకు నేరుగా ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనిపై విద్యాశాఖకు ఆదేశాలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ప్రత్యేక పరీక్ష నిర్వహించేవారిమని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి గురుకులాల్లో పది పాసైనా ప్రవేశాలు కల్పిస్తామన్నారు. గురుకులాల్లో 8వ తరగతి నుంచే NCC, NSS, స్కౌట్స్ అండ్ గైడ్స్, రెడ్ క్రాస్ వంటి అంశాల్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నారు.
News October 8, 2024
Stock Markets: నెగటివ్ సిగ్నల్స్.. నేడూ నష్టాలేనా!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజూ నష్టపోయే అవకాశమే ఉంది. ఆసియా మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్సే అందుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిక్కీ, స్ట్రెయిట్ టైమ్స్, హాంగ్‌సెంగ్, తైవాన్ వెయిటెడ్, కోస్పీ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సోమవారం US సూచీలూ ఎరుపెక్కాయి. అనిశ్చితి, వెస్ట్ ఏషియా యుద్ధం, క్రూడాయిల్ రేట్లకు తోడు భారత్‌కు FPIల దెబ్బ ఎక్కువగా ఉంది. ఇక్కడి పెట్టుబడులను చైనా మార్కెట్లకు బదిలీ చేస్తున్నారు.
News October 8, 2024
హరియాణా: హ్యాట్రిక్ కొట్టిన చరిత్రే లేదు
హరియాణా ప్రజలు ఇప్పటి వరకు వరుసగా మూడోసారి ఎవరికీ పట్టం కట్టిన చరిత్ర లేదు. గరిష్ఠంగా రెండుసార్లే ఒక పార్టీకి అధికారం అప్పజెప్పారు. 1968, 72లో; 2005, 09లో కాంగ్రెస్‌ను గెలిపించారు. 2014, 19లో బీజేపీని అందలమెక్కించారు. దీనికి బ్రేక్ చేసి హ్యాట్రిక్ అందుకోవాలన్న బీజేపీ కల నెరవేరేలా లేదు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కే తీర్పునిచ్చాయి. JJP ఓటు బ్యాంకు వారికే బదిలీ అయినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.