News January 30, 2025
రాష్ట్రంలో రూ.44,776cr పెట్టుబడులకు ఆమోదం

AP: రాష్ట్రంలో 15 ప్రాజెక్టులకు సంబంధించి రూ.44,776cr పెట్టుబడులకు ప్రభుత్వ ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. అల్లూరి జిల్లాలో రూ.14,328 కోట్లతో ఏర్పాటు చేయనున్న 2,300MW విద్యుత్ ప్రాజెక్టుకు SIPB ఆమోదం లభించింది. దీంతో పాటు ఇతర ప్రాజెక్టులు CM చంద్రబాబు అధ్యక్షతన ఏర్పాటైన రాష్ట్ర పెట్టుబడుల బోర్డు సమావేశంలో ఆమోదం పొందాయి.
Similar News
News November 24, 2025
ముంబైలో “పాతాళ్ లోక్” నెట్వర్క్

ముంబైని ‘ట్రాఫిక్ ఫ్రీ’ నగరంగా తీర్చిదిద్దేందుకు MH ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముంబైలో భారీ టన్నెల్ నెట్వర్క్ నిర్మిస్తామని CM దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. ఈ టన్నెల్ నెట్వర్క్ ఇప్పటికే ఉన్న రోడ్లతో ప్యారలల్‌గా ఉంటుందని తెలిపారు. ఈ సొరంగ మార్గాన్ని ఫేమస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘పాతాళ్ లోక్’తో ఫడణవీస్ పోల్చారు. ఈ నెట్ వర్క్‌తో ముంబై ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పారు.
News November 24, 2025
3 సిక్సులు కొట్టడమే గొప్ప!

పాకిస్థాన్‌కు చెందిన జీరో స్టూడియోస్ ఆ దేశ క్రికెటర్ సాహిబ్జాదా ఫర్హాన్‌పై “Hero in the Making” అనే డాక్యుమెంటరీ తీసింది. దానికి అసలు కారణం ఏంటంటే ఆసియా కప్ 2025లో అతను బుమ్రా బౌలింగ్‌లో 3 సిక్సులు కొట్టడమే. కాగా ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ పాక్ ఓడిపోవడం తెలిసిందే. దీంతో ‘3 సిక్సులు కొట్టడాన్నే వీళ్లు సక్సెస్‌గా ఫీల్ అవుతున్నారు’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
News November 24, 2025
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 156 పోస్టులు

HYDలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<


