News November 4, 2024
శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం!.. ఎన్డీయే ప్రయత్నాలు

శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేలా ఎన్డీయే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అమిత్ షా కూడా ఈ మేరకు గతంలో నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు కూడా సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు బిల్లులపైనే కీలక చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది.
Similar News
News February 8, 2026
6-7 డేటింగ్: ‘పర్ఫెక్ట్’ వద్దు.. ‘ప్రశాంతత’ ముద్దు!

అందం, హోదాలో 10/10 ఉండే భాగస్వామి కోసం వెతికి అలసిపోకుండా నచ్చిన 6 లేదా 7 రేటింగ్ ఉన్నవారితో జెన్-జీ డేటింగ్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. దీనినే ‘6-7 డేటింగ్’ అంటున్నారు. సినిమాటిక్ రొమాన్స్ కంటే మానసిక ప్రశాంతత, భరోసా ఇచ్చే తోడు దొరికితే చాలని భావిస్తున్నారు. పర్ఫెక్ట్ పార్ట్‌నర్ అనే భ్రమల కంటే మనల్ని అర్థం చేసుకునే ‘గుడ్ ఎనఫ్’ పార్ట్‌నరే మేలని జెన్-జీ నమ్ముతోంది.
News February 8, 2026
SERలో 54 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

సౌత్ ఈస్ట్రన్ రైల్వే(<
News February 8, 2026
స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు కాస్త తగ్గాయి. గుంటూరు, తిరుపతిలో స్కిన్‌లెస్ కేజీ రూ.220-230 వరకు పలుకుతోంది. అటు హైదరాబాద్‌లో మాత్రం కేజీ రూ.270-280 ఉంది. విజయవాడ, కామారెడ్డిలోనూ రూ.270 వరకు విక్రయిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో మటన్ కేజీ ధర రూ.900-1,000 వరకు ఉంది. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.


