News April 21, 2025

ఒకేసారి APPSC, DSC పరీక్షలు.. అభ్యర్థుల్లో ఆందోళన

image

AP: మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు జరగనుండగా అదే సమయంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. దీంతో రెండింటికీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 16 నుంచి 26 వరకు పాలిటెక్నిక్, జూ.లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో మార్పు చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.

Similar News

News April 21, 2025

ఎండల తీవ్రతతో జనవాణి వేళల్లో మార్పులు

image

AP: ఎండల తీవ్రత దృష్ట్యా జనవాణి వేళల్లో మార్పులు చేసినట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ఇవాళ్టి నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి వస్తాయని తెలిపింది. సోమవారం నుంచి గురువారం వరకు రోజూ ఉ.9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మళ్లీ సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు నిర్వహిస్తామని పేర్కొంది. కాగా జనవాణి కింద ప్రజా సమస్యలపై జనసేన అర్జీలు స్వీకరించి పరిష్కారం చూపుతున్న విషయం తెలిసిందే.

News April 21, 2025

పోచంపల్లిలో అందాల భామల ర్యాంప్‌వాక్!

image

TG: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన భూదాన్ <<16153019>>పోచంపల్లిలో<<>> పర్యటించనున్న విషయం తెలిసిందే. ‘తెలంగాణ హ్యాండ్లూమ్ థీమ్’ పేరుతో మే 15న అక్కడ నిర్వహించనున్న కార్యక్రమంలో ఇక్కత్ పట్టుచీరలు ధరించి ర్యాంప్‌వాక్ చేయనున్నారు. అనంతరం చేనేత కార్మికులతో ముఖాముఖిలో పాల్గొంటారు. గద్వాల్ సిల్క్, గొల్లభామ కాటన్, నారాయణపేట వస్త్రాల స్టాల్స్‌ను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

News April 21, 2025

త్వరలో ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు

image

TG: 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ప్రతి గ్రామానికి మొబైల్ వాహనాలను పంపి పరీక్షలు నిర్వహించనుంది. లక్షణాలు బయటపడితే చికిత్స అందించనుంది. తొలి దశలో భద్రాద్రి, ఆదిలాబాద్, MBNR, సంగారెడ్డి, KNR జిల్లాల్లో క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

error: Content is protected !!