News October 24, 2024

గ్రూప్-1, గ్రూప్-2పై ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ ఆరా

image

AP: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం పెండింగ్ లో ఉన్న నియామకాలపై బోర్డు సభ్యులు, అధికారులతో రివ్యూ చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 సహా పలు పరీక్షలు, ఇంటర్వ్యూలపై ఆరా తీశారు. కొత్తగా ఇవ్వాల్సిన నోటిఫికేషన్లపై వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటామని అనురాధ తెలిపారు.

Similar News

News October 24, 2024

జగన్ నాకు షేర్లు బదిలీ చేయలేదు: షర్మిల

image

AP: జగన్ తనకు షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధమని షర్మిల మండిపడ్డారు. ‘ఆస్తులపై ప్రేమతో కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తెచ్చారు. సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదు. వాటిని బదిలీ చేసుకోవచ్చు. షేర్లు బదిలీ చేస్తే బెయిల్ రద్దవుతుందని జగన్ వాదిస్తున్నారు. 2019లో వంద శాతం వాటాలు బదలాయిస్తానని ఎంవోయూపై సంతకం ఎలా చేశారు? అప్పుడు మీ బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా?’ అని ప్రశ్నించారు.

News October 24, 2024

ఈ ఎలుక చాలా స్పెషల్

image

ఇంట్లో ఆహార పొట్లాలకు చిల్లులు పెట్టి చిత్తడి చేసే ఎలుక కాదిది. ల్యాండ్‌మైన్‌లు, క్షయవ్యాధిని గుర్తించగలిగేలా శిక్షణ పొందిన ర్యాట్ ఇది. దీని పేరు మగావా. బెల్జియం ఛారిటీ సంస్థ APOPOలో మగావా శిక్షణ పొందింది. ఐదేళ్ల కెరీర్‌లో ఈ చిట్టెలుక కంబోడియాలో 100కి పైగా ల్యాండ్‌మైన్‌లు, పేలుడు పదార్థాలను పసిగట్టింది. దీని వీరత్వానికి బంగారు పతకం కూడా లభించింది. ఇది జనవరి 2022లో చనిపోయింది.

News October 24, 2024

తమిళ తంబీల దెబ్బకు కుప్పకూలిన కివీస్

image

రెండో టెస్టులో తమిళ తంబీలు వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు న్యూజిలాండ్ జట్టు కుప్పకూలిపోయింది. అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న సుందర్ సంచలన ప్రదర్శన చేశారు. గింగిరాలు తిరిగే బంతులతో కివీస్ ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టారు. మొత్తం ఏడుగురు కివీస్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపారు. మరోవైపు అశ్విన్ కూడా 3 వికెట్లతో చెలరేగడంతో పర్యాటక జట్టు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.