News February 26, 2026

APRCET 2024-2025 ర్యాంక్ కార్డుల విడుదల

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ కె. మధు మూర్తి, మహిళా యూనివర్సిటీ VC ప్రొఫెసర్ వి. ఉమ APRCET 2024-2025 ర్యాంక్ కార్డులను విడుదల చేసినట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. పూర్తి వివరాలు ఉన్నత విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/RCET చూడాలని సూచించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News April 16, 2026

మే 9న కొవ్వూరులో జాతీయ లోక్‌ అదాలత్‌

image

రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఆదేశాల మేరకు మే 9న కొవ్వూరు కోర్టుల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు 9వ జిల్లా జడ్జి ఎం.అనురాధ తెలిపారు. ఈ అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. భార్యాభర్తల తగాదాలు, గృహహింస కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 16, 2026

తమిళనాడులో TVK విజయ్ మ్యానిఫెస్టో.. పెళ్లికి 8 గ్రా. బంగారం

image

*60 ఏళ్ల కంటే తక్కువ వయసున్న మహిళలకు నెలకు రూ.2,500
*ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు
*పేదవారి పెళ్లికి 8 గ్రాముల బంగారం, పట్టు చీర
*ప్రతి ఇంటికి సురక్షిత మంచి నీరు
*పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చదివిస్తే ఏడాదికి రూ.15వేలు
*ఉన్నత విద్యకు రూ.20 లక్షల వరకు లోన్లు
*రాష్ట్రవ్యాప్తంగా 100 రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు
*రైతుల పంట రుణాలు మాఫీ

News April 16, 2026

GNT: స్వీయ జనగణనలో సీఎం చంద్రబాబు

image

రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు se.census.gov.in పోర్టల్ ద్వారా తన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. 33 ప్రశ్నలతో కూడిన ఈ విధానాన్ని ఏపీ జనగణన డైరెక్టర్ నివాస్.. సీఎంకు వివరించారు. ప్రజలు కూడా ఈ నెల 30వ తేదీ వరకు తమ కుటుంబ, ఇళ్ల వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.