News February 26, 2026
APRCET 2024-2025 ర్యాంక్ కార్డుల విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ కె. మధు మూర్తి, మహిళా యూనివర్సిటీ VC ప్రొఫెసర్ వి. ఉమ APRCET 2024-2025 ర్యాంక్ కార్డులను విడుదల చేసినట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. పూర్తి వివరాలు ఉన్నత విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/RCET చూడాలని సూచించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News April 20, 2026
హ్యాపీ బర్త్‌డే మావయ్య: NTR

ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ హ్యాపీ బర్త్‌డే మావయ్యగారు అని SMలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని.. ఇదే నిబద్ధత, విజన్‌తో ప్రజలకు సేవలు కొనసాగించాలని కోరుకున్నారు. మీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలని ఆశిస్తున్నానని Xలో పోస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ చీఫ్ జగన్ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
News April 20, 2026
హనుమకొండలో విద్యార్థినిపై దారుణం.. వీడియో వైరల్

హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని ఓ కళాశాలలో విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. ఇంటర్ చదువుతున్న జూనియర్ విద్యార్థినిని అదే కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థి మోసం చేసి, స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. బట్టలు విప్పించి వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. ఆ వీడియోను వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడంతో విషయం బయటపడింది. బాధితురాలి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదైంది.
News April 20, 2026
రహానే చెత్త రికార్డు

నిన్న RRతో మ్యాచులో సున్నాకే ఔటైన KKR కెప్టెన్ రహానే IPLలో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఓపెనర్‌గా అత్యధిక సార్లు(12) డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో పార్థివ్ పటేల్(11), శిఖర్(10), గంభీర్(10), వార్నర్(9) ఉన్నారు. ఓవరాల్(బ్యాటింగ్ పొజిషన్‌తో సంబంధం లేకుండా)గా మ్యాక్స్‌వెల్(19) టాప్‌లో ఉన్నారు. కాగా సీజన్‌లో రహానే 7 మ్యాచుల్లో 25.33 యావరేజ్‌తో 152 రన్స్ చేశారు.


