News April 1, 2024

ఏప్రిల్ 1.. ఫూల్స్ డే

image

ఏప్రిల్ 1 అనగానే మొదట గుర్తొచ్చేది ఫూల్స్ డే. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. 1582లో జూలియన్ క్యాలెండర్ పోయి జార్జియన్ క్యాలెండర్ అనుసరణలోకి వచ్చింది. జార్జియన్ క్యాలెండర్లో జనవరి 1న ఏడాది ప్రారంభం కాగా.. జూలియన్ క్యాలెండర్లో ఏప్రిల్ 1గా ఉంది. దీంతో కొత్త క్యాలెండర్‌కు అలవాటు పడని వారు ఏప్రిల్ 1నే కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకుంటే, వారిని ‘ఏప్రిల్ ఫూల్స్’ అని ఆట పట్టించారట.

Similar News

News March 25, 2026

చిన్న నియోజకవర్గం.. గొప్ప అభివృద్ధి

image

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్‌సభ స్థానాలు పెరుగుతాయి. దీనివల్ల ఒక్కో MP పరిధిలోని జనాభా 30 లక్షల నుంచి 15 లక్షలకు తగ్గుతుంది. చిన్న నియోజకవర్గాల వల్ల MPలు ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తారు. ఫలితంగా స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు MP నిధుల వినియోగంలో పారదర్శకత పెరుగుతుంది. ఈ మార్పు క్షేత్రస్థాయి అభివృద్ధికి, యువ నాయకత్వం రాజకీయాల్లోకి రావడానికి అవకాశంగా నిలుస్తుంది.

News March 25, 2026

అమెరికా-ఇరాన్ మధ్య పాక్.. వ్యూహమా? స్వార్థమా?

image

US, ఇరాన్ మధ్య గొడవను ఆపేందుకు పాక్ ఇప్పుడు మధ్యవర్తిగా మారుతోంది. దీని వెనుక శాంతి కంటే స్వార్థమే ఎక్కువ కనిపిస్తోందని అనలిస్టులు అంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాలేక గల్ఫ్ దేశాల సపోర్ట్ కోసం ఇలా చేస్తోందని విశ్లేషిస్తున్నారు. అలాగే ఇండియా ఇన్‌ఫ్లుయెన్స్‌ను తగ్గించాలనే వ్యూహమూ కనిపిస్తోందంటున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ డైరెక్షన్‌లో జరుగుతున్న ఈ టాక్టిక్స్‌కు ఇరాన్ ఇంకా ఓకే చెప్పలేదు.

News March 25, 2026

రామ్ చరణ్‌కు గాయం?

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటికి గాయమైనట్లు తెలుస్తోంది. పెద్ది సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదమేమీ లేదని, రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించినట్లు టాక్. చరణ్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.