News March 27, 2025

ఏప్రిల్ 1: మారేవి ఇవే

image

ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.
* రూ.12 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ లేదు
* టీడీఎస్, టీసీఎస్ పరిమితుల్లో మార్పులు
* SBI, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు రివార్డుల్లో సవరణలు
* ఇన్‌యాక్టివ్ లేదా ఇతరులకు కేటాయించిన మొబైల్ నంబర్లకు నిలిచిపోనున్న యూపీఐ సేవలు

Similar News

News March 30, 2025

వార్న్ మరణంలో కొత్త కోణం

image

దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ మరణంలో మరో కోణం తెరపైకి వచ్చింది. ఆయన మరణించిన విల్లాలో లైంగిక సామర్థ్యానికి సంబంధించిన ఓ మెడిసిన్‌ను గుర్తించినట్లు బ్రిటన్ మీడియా పేర్కొంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో దానిని తొలగించారని కథనంలో పేర్కొంది. ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చడంలో ఆస్ట్రేలియా అధికారుల పాత్ర ఉండవచ్చని ఆ విల్లాకు వెళ్లిన ఓ పోలీసు అధికారి తాజాగా తెలిపాడు. 2022లో థాయ్‌లాండ్‌లో వార్న్ హఠాన్మరణం చెందారు.

News March 30, 2025

టెన్త్ పాసై ఈత వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు

image

నేవీలో 327 బోట్ క్రూ స్టాఫ్ (గ్రూప్ C) పోస్టుల దరఖాస్తుకు ఏప్రిల్ 1తో గడువు ముగియనుంది. 57 సిరాంగ్ ఆఫ్ లాస్కర్స్, 192 లాస్కర్-1, 73 ఫైర్‌మ్యాన్ (బోట్ క్రూ), 5 టోపాస్ పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులకు పదో తరగతి పాస్ కావడంతో పాటు ఈత రావాలి. లాస్కర్ సిరాంగ్ పోస్టులకు అదనంగా రెండేళ్లు, లాస్కర్-1 పోస్టులకు ఒక ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 18-25 ఏళ్లు. పూర్తి వివరాలకు సైట్: joinindiannavy.gov.in/

News March 30, 2025

రంజాన్ లౌకికవాదానికి ప్రతీక: సీఎం రేవంత్

image

TG: ముస్లింలకు సీఎం రేవంత్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘రంజాన్ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఖురాన్‌ ఉద్భవించిన రంజాన్‌ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దానధర్మాలు మానవాళికి ఆదర్శం. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది’ అని తెలిపారు.

error: Content is protected !!