News April 10, 2025
ఏప్రిల్ 10: చరిత్రలో ఈరోజు

1894: వ్యాపారవేత్త ఘనశ్యాం దాస్ బిర్లా జననం
1898: స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత దశిక సూర్యప్రకాశరావు జననం
1941: భారత మాజీ దౌత్యవేత్త మణి శంకర్ అయ్యర్ జననం
1995: భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి మరణం(ఫొటోలో)
* ప్రపంచ హోమియోపతి దినోత్సవం * అంతర్జాతీయ తోబుట్టువుల రోజు
Similar News
News September 14, 2025
BREAKING: అస్సాంలో భారీ భూకంపం

అస్సాంలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. సోనిత్పూర్ జిల్లాలో రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొరుగు దేశాలు చైనా, భూటాన్, మయన్మార్లోనూ భూమి కంపించింది. కాగా ఇవాళ ప్రధాని మోదీ అస్సాంలో పర్యటించిన సంగతి తెలిసిందే.
News September 14, 2025
ఒడిశా OAS పరీక్షల్లో టాపర్.. లంచం తీసుకుంటూ..

ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (OAS)-2019 టాపర్ అశ్విన్ కుమార్ లంచం తీసుకుంటూ పట్టుబడటం చర్చనీయాంశమైంది. 2021లో ప్రభుత్వ సర్వీసులో చేరిన ఆయన అట్టడుగు వర్గాలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. తహశీల్దార్గా పనిచేస్తున్న ఆయనను తాజాగా రూ.15వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. టాపర్గా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తే ఇలా అవినీతికి పాల్పడటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
News September 14, 2025
అందుకే.. సాయంత్రం ఈ పనులు చేయొద్దంటారు!

సూర్యాస్తమయం తర్వాత వచ్చే సుమారు 45 నిమిషాల కాలాన్ని అసుర సంధ్య వేళ, గోధూళి వేళ అని అంటారు. ఈ సమయంలో శివుడు, పార్వతీ సమేతంగా తాండవం చేస్తాడని నమ్ముతారు. శివతాండవ వీక్షణానందంతో అసుర శక్తులు విజృంభించి జనులను బాధిస్తాయి. ఈ వేళలో ఆకలి, నిద్ర, బద్ధకం వంటి కోరికలు కలుగుతాయి. వీటికి లోనైతే ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అందుకే ఈ వేళలో నిద్రపోవడం, తినడం, సంభోగం వంటి పనులు చేయొద్దని పెద్దలు చెబుతుంటారు.