News April 11, 2025

ఏప్రిల్ 11: చరిత్రలో ఈరోజు

image

1827: సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే జననం (ఎడమ ఫొటో)
1869: కస్తూరిబాయి గాంధీ జననం (కుడి ఫొటో)
1904: నటుడు, గాయకుడు కుందన్ లాల్ జననం
1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పాటు
2010: నక్సలైట్ ఉద్యమకారుడు పైలా వాసుదేవరావు మరణం
* ప్రపంచ పార్కిన్సన్స్ దినోత్సవం * జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం

Similar News

News April 18, 2025

MMTSలో అత్యాచారయత్నం కేసు.. బిగ్ ట్విస్ట్

image

కొద్దిరోజుల క్రితం HYD MMTSలో అత్యాచారయత్నం సందర్భంగా యువతి రైలు నుంచి కిందకి <<15866506>>దూకేసిన<<>> ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు యువతిపై అత్యాచార యత్నమే జరగలేదని విచారణలో తేలింది. రైలులో వెళ్తూ ఇన్‌స్టా రీల్స్ చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ విషయం చెబితే అంతా తిడతారని భయపడి ఓ యువకుడు అత్యాచారం చేయబోగా కిందకి దూకేసినట్లు చెప్పింది. తాజాగా ఆమె నిజం ఒప్పుకోవడంతో పోలీసులు షాక్ అయ్యారు.

News April 18, 2025

ఢిల్లీ నుంచి ఏ శక్తీ తమిళనాడును పాలించలేదు: స్టాలిన్

image

కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు, పార్టీలను విచ్ఛిన్నం చేసే BJP వ్యూహాలు తమిళనాడులో పనిచేయవని CM స్టాలిన్ స్పష్టం చేశారు. ఆ పార్టీ కలిగించే అడ్డంకులను చట్టప్రకారం ఎదుర్కొంటామని చెప్పారు. ‘2026లోనూ తమిళనాడులో ద్రవిడ ప్రభుత్వమే వస్తుంది. ఢిల్లీ నుంచి ఏ శక్తీ మా రాష్ట్రాన్ని పాలించలేదు. వారికి తలవంచడానికి మేం బానిసలం కాదు. నేను బతికున్నంత వరకు ఇక్కడ ఢిల్లీ ప్రణాళికలు పనిచేయవు’ అని తేల్చిచెప్పారు.

News April 18, 2025

WILDLIFE PHOTOS: గాయపడిన సింహం

image

అడవికి రారాజు సింహమే అయినా ఆహారం కోసం అది వేటాడాల్సిందే. ఈ ప్రక్రియలో ఒక్కోసారి అవి తీవ్రంగా గాయపడిన పరిస్థితులూ ఉన్నాయి. మనుగడ కోసం జరిగిన ఘర్షణలో గాయపడిన ఓ సింహపు ఫొటోలను వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ హర్మన్ సింగ్ హీర్ క్లిక్‌మనిపించారు. తలపై గాయాలు, ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతిని కనిపించింది. అడవిలో ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలో సింహాలు ఎంతలా గాయపడతాయో ఈ ఫొటోల్లో చూపించారు.

error: Content is protected !!