News April 14, 2025
ఏప్రిల్ 14: చరిత్రలో ఈరోజు

1891: భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి
1892: తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత గొబ్బూరి వెంకటానంద రాఘవరావు జయంతి
1939: సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు జయంతి
1950: భారత్ తత్వవేత్త శ్రీ రమణ మహర్షి వర్ధంతి
1963: రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వర్ధంతి
2011: సినీ నటుడు, ప్రతినాయకుడు రామిరెడ్డి వర్ధంతి
Similar News
News April 15, 2025
ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్!

TG: మంత్రి పదవి విషయంలో పలువురు నేతలు బహిరంగంగా మాట్లాడటంపై సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పదవుల విషయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని, అలా మాట్లాడితే లాభం కంటే మీకే నష్టం ఎక్కువని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పదవుల విషయం అధిష్ఠానం చూసుకుంటుందని నేతలకు ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒక్క MLA కూడా సోషల్ మీడియా వాడట్లేదని, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు.
News April 15, 2025
బంగ్లాదేశ్‌లో భారత జట్టు పర్యటన.. షెడ్యూల్

భారత సీనియర్ మెన్స్ జట్టు ఈ ఏడాది బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టులో జరిగే ఈ పర్యటనలో భాగంగా 3 వన్డేలు, 3 T20లు ఆడనుంది. మిర్పూర్ వేదికగా 17, 20 తేదీల్లో తొలి రెండు వన్డేలు ఆడనుంది. ఆగస్టు 23న చట్టోగ్రామ్‌లో 3 వన్డే ఆడనుంది. ఆ తర్వాత తొలి T20 ఆగస్టు 26న చట్టోగ్రామ్‌లో, మిగతా రెండు T20లను ఆగస్టు 29, 31 తేదీల్లో మిర్పూర్ వేదికగా ఆడనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది.
News April 15, 2025
త్వరలో ‘SSMB29’ గ్లింప్స్?

రాజమౌళి, మహేశ్‌బాబు కాంబోలో తెరకెక్కుతోన్న ‘SSMB29’ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ను అబ్బురపరిచేలా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టన్నింగ్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ సిద్ధం చేస్తున్నారని, ఇది పూర్తయ్యాక అనౌన్స్‌మెంట్ చేస్తారని సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.