News April 16, 2025
ఏప్రిల్ 16: చరిత్రలో ఈరోజు

1848: సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు(ఫొటోలో) జననం
1889: హాస్యనటుడు చార్లీ చాప్లిన్ జననం
1910: సాహితీవేత్త ఎన్ఎస్ కృష్ణమూర్తి జననం
1914: చిత్రకారుడు కేహెచ్ ఆరా జననం
1951: హాస్యనటుడు ఎంఎస్ నారాయణ జననం
1853: భారత్‌లో తొలి పాసింజర్ రైలును బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభించింది
Similar News
News November 6, 2025
వస్తున్నా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా: బండి

TG: జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా ఇవాళ సాయంత్రం బోరబండకు వస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. ‘ఎవరు అడ్డుకుంటారో చూస్తా. కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలి. సాయంత్రం BJP దమ్మేంటో చూపిద్దాం’ అని పిలుపునిచ్చారు. తన మీటింగ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదన్న ప్రచారం నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. అయితే తాము అనుమతి రద్దు చేశామనేది తప్పుడు ప్రచారమని, తమను ఎవరూ అనుమతే కోరలేదని పోలీసులు తెలిపారు.
News November 6, 2025
వివాహంలో కచ్చితంగా చేయాల్సిన 16 విధులు

1. వరాగమనం (వరుడి రాక), 2. స్నాతకం (వరుడి స్నానం),
3. మధుపర్క్ (మధుపర్క స్వీకరణ), 4. మంగళ స్నానం,
5. గౌరీ పూజ, 6. కన్యావరణం, 7. కన్యాదానము,
8. సుముహూర్తం (జీలకర్ర బెల్లం), 9. మంగళ సూత్ర ధారణ,
10. తలంబ్రాలు, 11. హోమం, 12. పాణిగ్రహణం,
13. సప్తపది (7 అడుగులు), 14. అరుంధతీ నక్షత్ర దర్శనం,
15. స్థాలీపాకం, 16. నాగవల్లి (చివరి పూజ).
☞ ఈ విధులు పూర్తవడంతో వివాహ మహోత్సవం సంపూర్ణమవుతుంది. <<-se>>#pendli<<>>
News November 6, 2025
వీల్‌ఛైర్ మోడల్

అవయవలోపంతో జన్మించిన అబోలీ జరిత్ను మొదట్లో బ్రతకడమే కష్టమన్నారు. వారి మాటల్ని వమ్ము చేస్తూ సోషల్‌మీడియా సెలబ్రిటీగా మారిందామె. నాగ్‌పూర్‌కు చెందిన అబోలీ చిన్నతనంలోనే అరుదైన ఎముకలసమస్య బారినపడింది. దీనికితోడు మూత్రపిండాల వైఫల్యం. దీనివల్ల నిత్యం డైపర్‌తో వీల్‌ఛైర్‌లో ఉండాల్సిందే. వీటన్నిటినీ దాటి సింగర్, యాక్టర్‌గా మారాలనుకుంటున్న ఆమె ప్రస్తుతం వీల్‌ఛైర్ మోడల్‌గా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.


