News April 17, 2024
ఏప్రిల్ 17: చరిత్రలో ఈరోజు

1756: స్వాతంత్ర్య సమరయోధుడు ధీరన్ చిన్నమలై జననం
1897: ఆధ్యాత్మిక గురువు నిసర్గదత్తా మహరాజ్ జననం
1966: తమిళ హీరో విక్రమ్ జననం
1979: తమిళ హీరో సిద్ధార్ధ్ జననం
1790: అమెరికా సహవ్యవస్థాపకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరణం
1975: భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మరణం
2004: సినీ నటి సౌందర్య మరణం
Similar News
News January 25, 2026
చిన్న స్టెప్.. పెద్ద లాభం!

ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? అయితే టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఇచ్చే టైపింగ్ సర్టిఫికెట్ తప్పక పొందండి. టైపిస్ట్, స్టెనో, క్లర్క్స్ తదితర ఉద్యోగాలకు డిగ్రీలతో పాటు ఈ సర్టిఫికేషన్ తప్పనిసరి. మనకు సూపర్ ఫాస్ట్ టైపింగ్ స్కిల్స్ ఉన్నా, వాటిని గుర్తించేలా ధ్రువీకరణ పత్రం కావాలి. కాబట్టి తక్కువ సమయమే పట్టే ఈ చిన్న మైల్‌స్టోన్ మీ క్వాలిఫికేషన్స్ లిస్ట్‌లో చేరితే ఎక్కువ జాబ్ ఆప్షన్స్ ఉంటాయి.
Share It
News January 25, 2026
ఆ ఛానల్ డిబేట్లలో పాల్గొనం: BRS

TG: ఏబీఎన్ ఛానల్‌లో జరిగే చర్చల్లో ఇకపై తమ పార్టీ నాయకులు పాల్గొనబోరని బీఆర్ఎస్ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమకారుడు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో ఏబీఎన్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్, జిల్లా ఆఫీసుల్లో జరిగే సమావేశాలకు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులను ఇకపై అనుమతించబోమని ట్వీట్ చేసింది.
News January 25, 2026
సింగరేణిలో మిగిలిన స్కామ్‌లను బయటపెడతాం: హరీశ్ రావు

TG: స్వార్థ ప్రయోజనాల కోసమే సింగరేణిలో కొత్త నిబంధనలు తీసుకొచ్చారని BRS నేత హరీశ్ రావు ఆరోపించారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతోంది. సింగరేణి కార్మికులను కూడా ప్రభుత్వం మోసం చేస్తోంది. వారికి వైద్యాన్నీ దూరం చేశారు. సంస్థ అభివృద్ధి కోసం పక్కనపెట్టిన రూ.6వేల కోట్ల లెక్కతేల్చుతాం. సింగరేణిలో మిగిలిన స్కామ్‌లను బయటపెడతాం’ అని వ్యాఖ్యానించారు.


