News April 18, 2024

ఏప్రిల్ 18: చరిత్రలో ఈరోజు

image

1809: కవి, పండితుడు హెన్రీ డెరోజియా జననం
1880: రచయిత టేకుమళ్ల అచ్యుతరావు జననం
1958: విండీస్ మాజీ క్రికెటర్ మాల్కం మార్షల్ జననం
1859: స్వాతంత్ర్యసమరయోధుడు తాంతియా తోపే మరణం
1955: శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మరణం
>>ప్రపంచ వారసత్వ దినోత్సవం (అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం)

Similar News

News November 18, 2024

రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవంటూ హైకోర్టులో పిటిషన్

image

TG: రాష్ట్రంలో రోడ్లు సరిగా లేవని, గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై CJ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రజలు రోడ్డు సమస్యలు తెలిపేలా మొబైల్ యాప్ రూపొందించి R&B, HMDA అధికారులు దాన్ని నిర్వహించాలని గతంలో ఆదేశించినట్లు హైకోర్టు అధికారులకు గుర్తు చేసింది. మరో నెలలో యాప్ అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారు. ఆపై విచారణను హైకోర్టు వచ్చే నెల 12కు వాయిదా వేసింది.

News November 18, 2024

ట్రంప్ అలా చేస్తే భారత్-US మధ్య ట్రేడ్ వార్: సుహాస్ సుబ్రహ్మణ్యం

image

భారత ఎగుమతులపై అమెరికా అధిక టారిఫ్‌లు విధిస్తే అది ఇరు దేశాల మధ్య ట్రేడ్ వార్‌కు దారి తీస్తుందని US కాంగ్రెస్‌కు ఎన్నికైన‌ సుహాస్ సుబ్ర‌హ్మ‌ణ్యం వ్యాఖ్యానించారు. అందుకే భార‌త్‌పై టారిఫ్‌ల‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. US వాణిజ్య లోటును త‌గ్గించేలా భార‌త్‌, చైనాల ఎగుమతులపై Reciprocal Tax విధిస్తామని ఎన్నికల వేళ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సుహాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

News November 18, 2024

BREAKING: పోసానిపై సీఐడీ కేసు

image

AP: తెలుగు నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళిపై సీఐడీ కేసు నమోదైంది. చంద్రబాబును కించపరిచేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోసాని మాట్లాడారని టీడీపీ నేత బండారు వంశీకృష్ణ ఫిర్యాదుతో ఆయనపై 111, 196, 353, 299, 336(3)(4), 341, 61(2) BNS సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.