News April 2, 2025

ఏప్రిల్2: చరిత్రలో ఈరోజు

image

1915: తెలుగు సినిమా నటుడు కొచ్చర్లకోట సత్యనారాయణ జననం
1969: నటుడు అజయ్ దేవగన్ జననం
1981: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ జననం
1872: టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త శామ్యూల్ F.B మోర్స్ మరణం
1933: భారత మాజీ క్రికెటర్ రంజిత్ సిన్హ్‌జీ మరణం
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం

Similar News

News December 3, 2025

రాగి పాత్రలు వాడుతున్నారా?

image

ఆరోగ్యం కోసం ప్రస్తుతం చాలామంది రాగిపాత్రల వాడకం మొదలుపెట్టారు. అయితే వీటిలో కొన్ని ఆహారపదార్థాలు పెట్టేటపుడు జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. రాగిపాత్రలో పెట్టిన పెరుగును తింటే వికారం, వాంతులు, విరేచనాలు అవుతాయి. అలా-గే సిట్రస్ ఫ్రూట్స్‌తో పెట్టిన పచ్చళ్లు, ఆహారాలు రాగితో రసాయన చర్యలు జరుపుతాయి. కేవలం నీటిని, అదీ 8-12 గంటలపాటు నిల్వ ఉంచిన నీటినే తాగాలని సూచిస్తున్నారు.

News December 3, 2025

చెలరేగిన బ్యాటర్లు.. భారత్ భారీ స్కోర్

image

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ 358/5 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్(14), జైస్వాల్(22) నిరాశపరచగా.. రుతురాజ్(105) వన్డేల్లో తొలి సెంచరీ బాదారు. కోహ్లీ(102) వరుసగా రెండో వన్డేలోనూ శతకం నమోదు చేశారు. రాహుల్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, వరుసగా రెండో అర్ధసెంచరీ(66*) చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్ 2, బర్గర్, ఎంగిడి తలో వికెట్ తీశారు.

News December 3, 2025

రేవంత్ క్షమాపణలు చెప్పాలి: కిషన్ రెడ్డి

image

TG: హిందూ దేవుళ్లను సీఎం రేవంత్ అవమానించేలా మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. CM రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి ఉందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు సీఎం రేవంత్ హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని ఆరోపించారు.