News April 28, 2024

ఏప్రిల్ 28: చరిత్రలో ఈరోజు

image

* 1740: మరాఠా సామ్రాజ్యానికి చెందిన 6వ పేష్వా బాజీరావ్ మరణం
* 1897: రచయిత, నటుడు, నాటకకర్త భమిడిపాటి కామేశ్వరరావు జననం
* 1945: ఇటలీ రాజకీయ నాయకుడు ముస్సోలినీ మరణం
* 1987: ప్రముఖ నటి సమంత జననం
* ప్రపంచ భద్రతా దినోత్సవం

Similar News

News October 23, 2025

ఇండియా టెక్ డెస్టినేషన్‌గా ఏపీ: CM CBN

image

డేటా సెంటర్లు, AI మెషీన్ లెర్నింగ్, ఫిన్‌టెక్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్సు వంటి రంగాల్లో పెట్టుబడులకు AP ఎంతో అనుకూలమని CM CBN తెలిపారు. ఇండియా టెక్ డెస్టినేషన్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. UAE టెక్ కంపెనీలతో కలిసి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అబుదబీలో నెట్వర్క్ లంచ్‌లో పాల్గొన్న ఆయన ఆ దేశ ఛాంబర్ ఛైర్మన్, ADNOC గ్లోబల్ ట్రేడింగ్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

News October 23, 2025

తేలని ‘స్థానిక’ అంశం!

image

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తదుపరి సమావేశంలో చర్చిద్దామని CM రేవంత్ చెప్పినట్లు సమాచారం. BCలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. అయితే NOV 3న HC తీర్పు ఉండటంతో 7న మరోసారి భేటీ కావాలని సీఎం నిర్ణయించారు. ఆ రోజు రిజర్వేషన్లు, ఎలక్షన్స్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

News October 23, 2025

HYDలో సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఇన్నోవేషన్ సెంటర్

image

TG: USకు చెందిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. CM రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో జరిగిన భేటీలో ఈ విషయాన్ని వెల్లడించింది. HYDను ఎంచుకోవడాన్ని CM స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధి, రాష్ట్రాన్ని 2047నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే రాష్ట్ర ప్రభుత్వ ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ఆయన వారికి వివరించారు.