News April 4, 2025
ఏప్రిల్ 4: చరిత్రలో ఈరోజు

1976: నటి సిమ్రాన్ జననం
1841: అమెరికా మాజీ అధ్యక్షుడు విలియం హెన్రీ హారిసన్ మరణం
1942: తెలుగు రచయిత్రి చల్లా సత్యవాణి జననం
1968: పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ మరణం
1975: మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించిన రోజు
గనుల అవగాహన దినోత్సవం
Similar News
News January 17, 2026
నా భర్తను క్షమించను: నటుడు గోవిందా భార్య

నటుడు గోవిందాపై భార్య సునీత సంచలన కామెంట్లు చేశారు. జీవితంలోకి ఎందరో అమ్మాయిలు వస్తూ వెళ్తుంటారని, మనమే బాధ్యతగా ఉండాలని భర్తకు సూచించారు. తన భర్తను ఎప్పటికీ క్షమించనని అన్నారు. ‘మీకు 63ఏళ్లు వచ్చాయి. మన అమ్మాయి టీనాకు పెళ్లి చేయాలి. కొడుకు యశ్ కెరీర్‌పై ఫోకస్ పెట్టాలి. నేను నేపాల్ బిడ్డను. కత్తి తీశానంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇకనైనా జాగ్రత్తగా ఉండమని అతనికి చెప్తుంటా’ అని పేర్కొన్నారు.
News January 17, 2026
ఇతిహాసాలు క్విజ్ – 126 సమాధానం

ఈరోజు ప్రశ్న: రావణుడి చివరి శ్వాసలో లక్ష్మణుడు ఆయన దగ్గరకు వెళ్లి ఏం నేర్చుకున్నాడు?
సమాధానం: రావణుడి దగ్గర నుంచి లక్ష్మణుడు రాజనీతి నేర్చుకున్నాడు. రావణుడు ‘మంచి పనిని ఆలస్యం చేయక వెంటనే చేయాలి. శత్రువును తక్కువ అంచనా వేయకూడదు. తన మరణ రహస్యం విభీషణుడికి చెప్పడం వల్లే తాను ప్రాణాలు కోల్పోతున్నానని, కాబట్టి ప్రాణ స్నేహితుడికైనా ముఖ్య రహస్యాలు ను ఎప్పుడూ చెప్పకూడదు’ అని వివరించాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News January 17, 2026
సైలెంట్‌గా దెబ్బకొట్టిన ఇండియా.. అమెరికా పప్పులపై 30% టారిఫ్స్

అమెరికా టారిఫ్స్‌కు వాటితోనే సైలెంట్‌గా బదులిచ్చింది ఇండియా. US పప్పుధాన్యాల ఎగుమతులపై 30% సుంకం విధించింది. నవంబర్ 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ట్రంప్‌కు సెనేటర్లు రాసిన లేఖతో ఇది బయటపడింది. ఈ టారిఫ్స్ వల్ల US రైతులపై చాలా ప్రభావం పడుతుందంటూ వారు వాపోయారు. ప్రపంచంలో పప్పుధాన్యాల అతిపెద్ద వినియోగదారు భారత్(27%). USపై కేంద్రం సైలెంట్‌గానే ప్రతీకారం తీర్చుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


