News April 8, 2024
ఏప్రిల్ 8: చరిత్రలో ఈరోజు

1857: స్వాతంత్య్ర సమరయోధుడు మంగళ్ పాండే మరణం
1894: వందేమాతరం గీత రచయిత బంకిం చంద్ర ఛటర్జీ మరణం
1977: రచయిత శంకరంబాడి సుందరాచారి మరణం
1982: సినీనటుడు అల్లు అర్జున్ జననం
1983: నటి అనురాధ మెహతా జననం
1984: పాటల రచయిత అనంత శ్రీరామ్ జననం
1988: నటి నిత్యా మీనన్ జననం
1994: నటుడు అక్కినేని అఖిల్ జననం
Similar News
News January 22, 2026
పిల్లలకు SM వాడకంపై బ్యాన్ విధించే యోచనలో ఏపీ ప్రభుత్వం?

ఆంధ్రప్రదేశ్‌లో 16ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. AUS ప్రభుత్వం అమలు చేసిన SM బ్యాన్ నమూనాను ఏపీలో కూడా అధ్యయనం చేస్తున్నట్లు దావోస్‌లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. చిన్నారుల మానసిక ఆరోగ్యం, ఆన్‌లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని వారు SMను వాడకుండా ఉండేలా చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు చెప్పారు.
News January 22, 2026
విజయనగరం జిల్లా ఎస్. కోటలో మెగా జాబ్‌మేళా

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, విజయనగరం జిల్లా ఎస్ కోట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జనవరి 24న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ అర్హత గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.inలో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. 10 మల్టీ నేషనల్ కంపెనీలు 535 పోస్టులను భర్తీ చేయనున్నాయి.
News January 22, 2026
ఎన్‌కౌంటర్‌లో 15కు చేరిన మావోయిస్టు మృతుల సంఖ్య

ఝార్ఖండ్ <<18923190>>ఎన్‌కౌంటర్<<>> ఘటనలో మావోయిస్టు మృతుల సంఖ్య 15కు చేరింది. మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ ఉన్నారు. ఆయనపై రూ.5 కోట్ల రివార్డు ఉండడం గమనార్హం. సింగ్భూం జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.


