News July 12, 2024

APకి పవర్‌ఫుల్ ఆఫీసర్.. పవన్ పేషీలోకేనా?

image

కేరళకు చెందిన తెలుగు IAS అధికారి మైలవరపు కృష్ణతేజ ఏపీకి డిప్యుటేషన్‌పై రానున్నారు. ప్రస్తుతం త్రిసూర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన్ను మూడేళ్లపాటు ఏపీకి పంపేందుకు అనుమతిస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కేరళలో సమర్థుడైన IASగా పేరు తెచ్చుకున్న కృష్ణతేజ.. రెండు అంతర్జాతీయ, ఏడు జాతీయ అవార్డులను అందుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యవేక్షించే శాఖల్లో కృష్ణతేజ పనిచేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Similar News

News January 20, 2025

భారత క్రికెటర్లకు బీసీసీఐ షాక్

image

భారత క్రికెటర్లు మ్యాచ్‌లకు హాజరయ్యే సమయంలో వ్యక్తిగత వాహనాలు ఏర్పాటు చేసుకోవద్దని ఆటగాళ్లకు బీసీసీఐ స్పష్టం చేసింది. జట్టు సభ్యులంతా టీమ్ బస్సులోనే రావాలని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌(CAB)తో పాటు ఇతర రాష్ట్రాలకు తెలియజేసింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20 కోల్‌కతాలో జరగనున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ ఆదేశాలను పాటిస్తామని CAB అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీ తెలిపారు.

News January 20, 2025

నేడు ట్రంప్ ప్రమాణ స్వీకారం

image

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వాషింగ్టన్ క్యాపిటల్ హాల్‌లోని రోటుండా ఇండోర్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత ప్రభుత్వం నుండి విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

News January 20, 2025

జనవరి 20: చరిత్రలో ఈరోజు

image

1900: సంస్కృతాంధ్ర పండితుడు పరవస్తు వెంకట రంగాచార్యులు మరణం
1907: ప్రముఖ రంగస్థల నటుడు బందా కనకలింగేశ్వరరావు జననం
1920: సినీ దర్శకుడు, ‘జానపద బ్రహ్మ’ బి.విఠలాచార్య జననం
1940: సినీనటుడు ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు జననం
1957: భారత్ తొలి అణు రియాక్టర్ ‘అప్సర'(ముంబై) ప్రారంభం