News January 23, 2025
గణతంత్ర పరేడ్‌లో ఏపీ శకటం

ఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగే 76వ రిపబ్లిక్ డే పరేడ్‌లో 26 శకటాలను ప్రదర్శించనున్నారు. ఇందులో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, 10 కేంద్ర ప్రభుత్వ శకటాలు ఉన్నాయి. దక్షిణాది నుంచి AP, KAలకు అవకాశం దక్కగా, TGకు దక్కలేదు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న AKP(D) ఏటికొప్పాక బొమ్మల శకటానికి స్థానం దక్కింది. అంకుడు కర్రతో చేతితో తయారు చేసే ఈ బొమ్మలకు 2017లో భౌగోళిక గుర్తింపు దక్కింది. ఇవి పర్యావరణ అనుకూలమైనవి.
Similar News
News November 22, 2025
‘పండ్లు, కూరగాయల సాగుతో ఎక్కువ లాభం’

నారింజ పంట ఉత్పత్తికి నాణ్యమైన విత్తనాల కోసం నాగ్‌పూర్‌లో రూ.70 కోట్లతో క్లీన్‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలను అందజేయడంపై ICAR సైంటిస్టులు దృష్టిపెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే పండ్లు, కూరగాయ పంటలను సాగు చేయాలని.. యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్ వాడకంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
News November 22, 2025
ఇంగ్లండ్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లిష్ బ్యాటర్లను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. పోప్(33), డకెట్(28), జేమీ స్మిత్(15), అట్కిన్సన్(37), కార్స్(20) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్, డగ్గెట్ చెరో 3 వికెట్లు తీశారు. విజయం కోసం ఆస్ట్రేలియా 205 పరుగులు చేయాల్సి ఉంటుంది.
News November 22, 2025
iBOMMA కేసు.. సీఐడీ ఎంట్రీ

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అతనిపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు 10కి పైగా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే మనీలాండరింగ్ అంశంపై ఈడీ ఆరా తీయగా, తాజాగా CID కూడా ఎంట్రీ ఇచ్చింది. గేమింగ్, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన వ్యవహారంపై వివరాలను అధికారులు సేకరించారు. ప్రస్తుతం అతడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు 3 రోజులుగా విచారిస్తున్నారు.


