News July 4, 2024

నేటి నుంచి ఎప్‌సెట్ కౌన్సెలింగ్

image

TG: ఎప్‌సెట్ కౌన్సెలింగ్ తొలి విడత నేటి నుంచి ప్రారంభం కానుంది. 12వ తేదీ వరకు జరిగే ఈ ప్రక్రియలో విద్యార్థులు ప్రాసెసింగ్ రుసుం చెల్లించి, ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 6 నుంచి 13 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 8 నుంచి 15 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. ఈ నెల 19లోపు తొలి విడత సీట్లు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 13, 2026

గ్యాస్ దెబ్బ.. పెరిగిన టిఫిన్ల ధరలు!

image

ఎల్పీజీ కొరత సాకుగా చూపి హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు టిఫిన్ల ధరలు పెంచినట్లు తెలుస్తోంది. ప్రతి ఐటమ్‌పై ప్లేట్‌కు రూ.10 పెంచినట్లు వినియోగదారులు చెబుతున్నారు. అయితే ఇది తాత్కాలిక పెంపు మాత్రమేనని యాజమాన్యాలు అంటున్నాయి. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్లు దొరకడం లేదని, ఇటీవల LPG ధర కూడా పెరగడంతో నిర్వహణ ఖర్చులు ఎక్కువైనట్లు పేర్కొంటున్నాయి. మరి మీ ఏరియాలోనూ టిఫిన్ల ధరలు పెరిగాయా? COMMENT

News March 13, 2026

నువ్వుల పంటలో బిహారీ గొంగళి పురుగులను ఎలా నివారించాలి?

image

నువ్వుల పంట తొలిదశలో చిన్న గొంగళి పురుగులు ఆకు పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులు జల్లెడలా మారతాయి. ఎదిగిన గొంగళి పురుగులు మొగ్గలకు, పువ్వులకు, కాయలకు రంధ్రాలు చేసి విత్తనాలను తింటాయి. వీటి నివారణకు ఎకరాకు 16- 20 పక్షి స్థావరాలను, హెక్టారుకు ఒక దీపపు ఎరను అమర్చాలి. తొలుత లీటరు నీటికి వేపనూనె 5mlను, తర్వాతి దశలో లీటరు నీటికి క్లోరిఫైరిపాస్ 2.5ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News March 13, 2026

హార్ముజ్‌లో ముగ్గురు భారత నావికుల మృతి

image

హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన నౌకల్లోని ముగ్గురు భారత నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం ధ్రువీకరించింది. మరొకరి జాడ తెలియాల్సి ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వందలాది భారతీయులతో కూడిన ఇండియన్ షిప్స్ ఉన్నట్లు తెలిపింది. వీరి భద్రతను పర్యవేక్షించేందుకు కేంద్రం 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి ప్రతి నౌకను ట్రాక్ చేస్తున్నట్లు పేర్కొంది.