News December 19, 2024

APSFL దివాళా అంచున ఉంది: ఛైర్మన్ GV రెడ్డి

image

AP స్టేట్ ఫైబర్‌నెట్ ప్రస్తుతం దివాళా అంచున ఉందని ఛైర్మన్ GV రెడ్డి అన్నారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తీరుతో APSFL దివాళా తీసే స్థితికి వచ్చిందన్నారు. వైసీపీ హయాంలో సంస్థకు MDగా పనిచేసిన మధుసూదన్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోందన్నారు. వారి అక్రమాలు బయటపడకుండా ఒక మహిళా ఉద్యోగి సాయంతో దస్త్రాలు మార్చారని, ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేశామన్నారు.

Similar News

News February 22, 2026

గుడివాడ: ఫీజు రాయితీపై ప్రైవేట్ స్కూళ్ల మొండికేత

image

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో 50% రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ, గుడివాడలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లు వీటిని బేఖాతరు చేస్తున్నాయి. మాకు ఆ జీవోల గురించి తెలియదు అంటూ యాజమాన్యాలు తప్పించుకుంటున్నాయని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. MEO పలుమార్లు సూచించినా, స్కూళ్లలో విద్యార్థులను ఫీజుల కోసం వేధిస్తూనే ఉన్నారని ఆరోపిస్తున్నారు.

News February 22, 2026

కృష్ణా: ఈ మాస్టారు రూటే సెపరేటు..!

image

కోడూరు మండలం ఉల్లిపాలెం ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు వినూత్న బోధనతో ఆకట్టుకుంటున్నారు. పుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థులను నేరుగా ప్రకృతిలోకి తీసుకెళ్లి పాఠాలు చెబుతున్నారు. చేపల సాగు, మడ అడవుల సంరక్షణ, వ్యవసాయ పద్ధతులపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు సైన్స్ అంశాలను ఎంతో సులభంగా అర్థం చేసుకుంటున్నారు.

News February 22, 2026

గుడివాడ: రైలులో మర్చిపోయిన రూ.14 లక్షల సొత్తు అప్పగింత

image

విశాఖ నుంచి మచిలీపట్నం వెళ్తున్న రైలులో వరలక్ష్మి అనే మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌ను మర్చిపోయి భీమవరం టౌన్‌లో దిగిపోయారు. బాధితురాలి సమాచారంతో గుడివాడ రైల్వే ఎస్సై మహబూబ్ షరీఫ్ సిబ్బందితో కలిసి వెంటనే అప్రమత్తమయ్యారు. రైలు గుడివాడ రాగానే తనిఖీలు చేసి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అందులోని 110 గ్రాముల బంగారం, రూ. 5వేల నగదు, మొబైల్ ఫోన్‌ను (మొత్తం విలువ రూ.14 లక్షలు) పోలీసులు బాధితురాలికి అందజేశారు.