News January 17, 2026

APSRTCకి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

image

AP: APSRTCకి గవర్నెన్స్ నౌ 6వ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవార్డు దక్కింది. గతేడాది బస్ స్టేషన్లలో రాకపోకలను ముందస్తుగా ప్రకటించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడంతో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందించారు. ఈ అవార్డును RTC చీఫ్ ఇంజినీర్ Y.శ్రీనివాస రావు స్వీకరించారు. గతంలోనూ RTCకి పలు కేంద్ర ప్రభుత్వ అవార్డులతో పాటు స్కోచ్ పురస్కారాలు లభించిన విషయం తెలిసిందే.

Similar News

News February 12, 2026

తగ్గిన ధరలు.. రూ.50కే 4 కేజీల టమాటా

image

తెలుగు రాష్ట్రాల్లో టమాటాల ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌ మార్కెట్లో రూ.50కే 4 కేజీల టమాటాలు విక్రయిస్తున్నారు. అటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రైతులకు కేజీకి రూ.5 మాత్రమే దక్కుతుండటంతో రోడ్లపైనే పడేస్తున్నారు. మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అటు ఉల్లిపాయల ధరలు సైతం తగ్గి కేజీ రూ.30 వరకు పలుకుతున్నాయి.

News February 12, 2026

సచివాలయ ఉద్యోగులకు టాయిలెట్ల డ్యూటీనా: YCP ప్రశ్న

image

AP: NTR జిల్లా జగ్గయ్యపేటలో శివరాత్రి తిరునాళ్ల సందర్భంగా సచివాలయ ఉద్యోగులను టాయిలెట్ల దగ్గర కాపలా ఉండమని డ్యూటీలు వేయడం ఏంటని YCP ప్రశ్నించింది. ‘సచివాలయ ఉద్యోగులు మనుషులు అనుకుంటున్నారా లేక ప్రభుత్వానికి వెట్టి చాకిరి చేసే బానిసలు అనుకుంటున్నారా? అక్కడ ఏటా ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరమే కొత్తగా జరగడం లేదు. ఆదివారం, సెలవు రోజుల్లో ఉద్యోగులకు పని చెప్పడం దారుణం’ అని ట్వీట్ చేసింది.

News February 12, 2026

హెన్నాతో ఎన్నో లాభాలు

image

జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి మన పూర్వీకుల నుంచి హెన్నా వాడుతున్నారు. ఇది చుండ్రును తగ్గించడంతో పాటు, జుట్టుకు సహజసిద్ధమైన రంగును అందించి కండిషనింగ్ చేస్తుంది. దీంట్లోని యాంటీఫంగల్, యాంటీమైక్రోబియల్ గుణాలు కుదుళ్లలోని ఇన్ఫెక్షన్లను తొలగించడంతో పాటు జుట్టుకు పోషణను అందించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయంటున్నారు నిపుణులు. పొడిబారిన జుట్టుకు తేమను అందించి, చివర్లు చిట్లే సమస్యనూ తగ్గిస్తుంది.