News September 24, 2024

APSRTC ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ.. నేపథ్యమిదే.!

image

నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా APSRTC ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణరావు నియమితులయ్యారు. మచిలీపట్నంకు చెందిన ఈయన జిల్లాలో బీసీ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత. 2009, 2014లో మచిలీపట్నం ఎంపీగా టీడీపీ నుంచి విజయం సాధించారు. 2019లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Similar News

News February 11, 2026

కృష్ణా: కొల్లు రవీంద్రకు బెదిరింపు లేఖ.. కార్యకర్తల ఆందోళన!

image

మంత్రులు కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్రలకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపుతోంది. అనకాపల్లి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్రకు ముప్పు పొంచి ఉందన్న వార్తతో మచిలీపట్నం టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. సౌమ్యుడిగా పేరున్న రవీంద్రకు ఇటువంటి హెచ్చరికలు రావడంపై ఆయన అనుచరులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ భద్రత పెంచాలని కోరుతున్నారు.

News February 11, 2026

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు – కలెక్టర్ బాలాజీ

image

మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. నిబంధనల ప్రకారం తొలి విడతలో 308 మందికి అక్రిడిటేషన్లు మంజూరు చేశామని ఆయన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఈనెల 24న జరిగే సమావేశంలో పరిశీలిస్తామన్నారు. అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.