News October 23, 2024
AQI స్కోర్: ఇండియాను బీట్ చేసిన పాక్

దాయాది పాకిస్థాన్ బ్యాడ్ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమున్న దేశంగా అవతరించింది. AQI 394తో లాహోర్ మన ఢిల్లీని బీట్ చేసింది. సాధారణంగా Air Quality Index 100 ఉంటేనే ఆరోగ్యానికి మంచిదికాదు. ఇక 150 అయితే భయంకర రోగాలు అటాక్ చేస్తాయి. అలాంటిది 394 అంటే ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. ఇక ఢిల్లీ, కిన్షాసా, ముంబై, మిలనో, ఉలన్ బాటర్, కరాచీ సిటీస్ లాహోర్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
Similar News
News November 20, 2025
కొత్త సినిమాల కబుర్లు

* పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ అవుతుందని నిర్మాత రవి శంకర్ వెల్లడి.
* బాక్సాఫీస్ రారాజు వస్తున్నాడంటూ రాజాసాబ్ టీమ్ ట్వీట్. డిసెంబర్ 4న నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్ అవుతాయని ప్రకటన.
* తమిళ హీరో సూర్యకు టాలీవుడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కథ చెప్పినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉందని చర్చ.
News November 20, 2025
కుక్క కాటు వల్ల చనిపోతే రూ.5 లక్షల పరిహారం

కుక్క కాటు వల్ల ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.5 వేలు ఇస్తామని, ఇందులో రూ.3,500 బాధితులకు, రూ.1,500 ట్రీట్మెంట్ కోసం అందజేస్తామని తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఆయుష్మాన్ భారత్-ఆరోగ్య కర్ణాటక స్కీమ్ కింద పాము కాటు బాధితులకు నగదు రహిత చికిత్స అందించాలని నిర్ణయించింది.
News November 20, 2025
26న దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు

రైతులు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(SKM) వెల్లడించింది. రైతుల ఢిల్లీ మార్చ్కు ఐదేళ్లు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ‘నాడు కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. MSP, రుణమాఫీ, విద్యుత్ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి వాటిని పట్టించుకోలేదు’ అని ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ దవాలే మండిపడ్డారు.


