News November 18, 2024

పాక్ ODI టీమ్ హెడ్‌కోచ్‌గా అకీబ్

image

పాకిస్థాన్ వన్డే జట్టుకు నెలలోనే మూడో హెడ్ కోచ్ వచ్చారు. ఆ స్థానంలో మాజీ ఆల్‌రౌండర్ అకీబ్ జావేద్‌ను నియమించినట్లు PCB ప్రకటించింది. మేనేజ్‌మెంట్, ఆటగాళ్లతో విభేదాలతో గత నెల 28న ODI జట్టు కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో తాత్కాలిక కోచ్‌గా గిలెస్పీని ఎంపిక చేసింది. ఇప్పుడు ఆయననూ తప్పించి అకీబ్‌కు ఛాన్స్ ఇచ్చింది. ఈయన పాక్ తరఫున 163 ODIలు, 22 టెస్టులు ఆడారు.

Similar News

News November 18, 2024

ఈనెల 21న ‘తండేల్’ నుంచి ‘బుజ్జి తల్లి’ సాంగ్

image

అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ‘తండేల్’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘బుజ్జి తల్లి’ సాంగ్‌ను ఈనెల 21న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News November 18, 2024

మణిపుర్‌ మంటలు: మరోసారి అమిత్ షా హైలెవల్ మీటింగ్

image

మణిపుర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హై లెవల్ మీటింగ్ నిర్వహించారని తెలిసింది. ఆదివారం సైతం ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే వదిలేసి ఆయన సమీక్షించడం గమనార్హం. మైతేయ్ ప్రజలపై కుకీ మిలిటెంట్లు దాడులు చేయడంతో రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగింది. దీంతో కేంద్రం అదనంగా 50 కంపెనీల సాయుధ బలగాలను అక్కడికి తరలించింది. ఇప్పటికే మోహరించిన వాటితో కలిపి ఈ సంఖ్య 70కి చేరింది.

News November 18, 2024

లగచర్ల ఘటనలో DSPపై బదిలీ వేటు

image

TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి ఘటనలో DSPపై వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిగి కొత్త DSPగా శ్రీనివాస్‌ను ఉన్నతాధికారులు నియమించారు. ఈ ఘటనలో ఇవాళ దౌల్తాబాద్ మండలం సంగయ్యపల్లి పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ వికారాబాద్ కలెక్టర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.